కరోనా వైరస్ అప్‌డేట్: దేశంలో 18 లక్షలకు పైగా కరోనా కేసులు

  • Published By: vamsi ,Published On : August 3, 2020 / 11:42 AM IST
కరోనా వైరస్ అప్‌డేట్: దేశంలో 18 లక్షలకు పైగా కరోనా కేసులు

దేశంలో కరోనా వేగం ఆపే మార్గం కనిపించట్లేదు. ఇవాళ(3 ఆగస్ట్ 2020) దేశంలో కరోనా కేసులు 18 లక్షల 3 వేల 695కు చేరుకోగా.. ప్రస్తుతం 5 లక్షల 67 వేల 730 యాక్టివ్ కేసులు దేశంలో ఉన్నాయి. మొత్తం 11 లక్షల 86 వేల 203 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రమాదకరమైన వైరస్ కారణంగా ఇప్పటివరకు 38 వేల 135 మంది చనిపోయారు. గత 24 గంటల్లో 52 వేల 971 కొత్త కేసులు నమోదవగా.. అదే సమయంలో 771 మంది చనిపోయారు.



దేశంలో మరణాల రేటు 2.13 శాతానికి తగ్గగా.. భారతదేశంలో ఆరోగ్యవంతుల రేటు 65.44 శాతంగా ఉంది. కరోనా సోకిన వారిలో కొందరు ఆసుపత్రులలో వైద్య పర్యవేక్షణలో ఉండగా.. మిగిలినవారు ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ సగటు కంటే తక్కువ మరణాలు ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి అని ఆ శాఖ వెల్లడించింది. ప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం రెండు కోట్ల రెండు లక్షల రెండువేల 858 నమూనా పరీక్షలు జరిగాయి.



ఇక మహారాష్ట్రలో లక్ష 48 వేల 843 క్రియాశీల కేసులు ఉండగా.. అదే సమయంలో అక్కడ 15 వేల 576 మంది చనిపోయారు. ఇప్పటివరకు ఇక్కడ నాలుగు లక్షల 41 వేల 228 కేసులు నమోదయ్యాయి. తమిళనాడులో 56,998 క్రియాశీల కేసులు ఉండగా.. అదే సమయంలో 4,132 మంది మరణించారు. ఇక్కడ మొత్తం 57 లక్షల 613 కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో లక్ష 34 వేల 819 కేసులు కరోనా వైరస్ నమోదయ్యాయి. ఇక్కడ 74,598 క్రియాశీల కేసులు ఉన్నాయి. అదే సమయంలో, 57 వేల 725 మంది రోగులు కోలుకున్నారు. 2496 మంది మరణించారు.