కరోనా అప్‌డేట్: 2వేల మార్క్ దాటిన కేసులు… 62మంది మృతి

  • Published By: vamsi ,Published On : April 2, 2020 / 04:27 AM IST
కరోనా అప్‌డేట్: 2వేల మార్క్ దాటిన కేసులు… 62మంది మృతి

కరోనా వైరస్ దేశవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 9లక్షల కరోనా వైరస్(COVID-19)కేసులు నమోదయ్యాయి. ఇక మరణాల సంఖ్య 47వేలు దాటింది. అయితే రోజురోజుకీ విపరీతంగా పెరుగుతూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ మహమ్మారి మనదేశంలో కూడా తీవ్ర రూపం దాల్చింది. దేశంలో కరోనా వైరస్ కేసులు గడిచిన 24 గంటల్లో 400 నమోదయ్యాయి. దీంతో మొత్తం దేశంలో 2072కేసులు నమోదయ్యాయి.

భారత్‌లో కరోనా వైరస్ కారణంగా.. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం వచ్చిందని నిపుణులు చెబుతున్నారు. గత రెండు రోజులు దేశంలో వెలుగుచూస్తున్న కేసుల్లో 95 శాతం మంది ఢిల్లీలో తబ్లీగ్ జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్న వివిధ రాష్ట్రాలవారు కావడం గమనార్హం. మరోవైపు, దేశంలో వైరస్ కేసులకు 10 ప్రాంతాలు హాట్‌స్పాట్‌లుగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది.

ఏపీలో కోవిడ్-19 కేసుల సంఖ్య 111కి చేరుకోగా.. తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 127కు చేరుకుంది. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, రాజస్థాన్‌లలో పెద్ద సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 332 కేసులు నమోదయ్యాయి. దీని తర్వాత స్థానాల్లో కేరళ, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్ ఉన్నాయి. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 62 చనిపోగా.. అత్యధికంగా మహారాష్ట్రలో 14 మంది, తెలంగాణలో 9మంది, గుజరాత్‌, మధ్యప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్‌లో ఆరుగురు చొప్పున చనిపోయారు.

పంజాబ్ 4, కర్ణాటక 3, జమ్మూ కశ్మీర్, ఢిల్లీ 2, మిగతా రాష్ట్రాల్లో ఒక్కొక్కరు వైరస్ కారణంగా చనిపోగా.. 169 మంది బాధితులు కోలుకున్నారు. మహారాష్ట్రలో 332, కేరళలో 265, తమిళనాడు 234, ఢిల్లీలో 152, తెలంగాణ 127, రాజస్థాన్ 120, ఉత్తరప్రదేశ్‌లో 117, ఆంధ్రప్రదేశ్ 111, కర్ణాటకలో 110, గుజరాత్ 87, మధ్యప్రదేశ్ 86, జమ్మూ కశ్మీర్ 62, పంజాబ్ 42, హర్యానా 43, పశ్చిమ్ బెంగాల్ 37, బీహార్ 24, చండీగఢ్ 17, అసోం 13, లడఖ్ 13 మిగతా రాష్ట్రాల్లో 10లోపు కేసులు నమోదయ్యాయి.

Also Read | ప్రజల ఇక్కట్లు : అటు కరోనా..ఇటు ఎండలు