ఆరు రాష్ట్రాలకు కేంద్రం కరోనా హెచ్చరికలు

  • Published By: veegamteam ,Published On : March 6, 2020 / 05:57 AM IST
ఆరు రాష్ట్రాలకు కేంద్రం కరోనా హెచ్చరికలు

భారత్ లో కరోనా భయం మామూలుగా లేదు. కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆరు రాష్ట్రాలకు శుక్రవారం (మార్చి6,2020) హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా  ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్రహోంమంత్రిత్వశాఖ రాష్ట్రాలకు సూచించింది.

కరోనా వైరస్ బాధితుల సంఖ్య 30కి చేరుకున్న క్రమంలో ఆయా రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలసి సూచించింది. దీని కోసం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని..అనుమానులను వెంటనే అదుపలోకి తీసుకుని వారికి పరీక్షలు చేయించాలని సూచించింది.(విశాఖ సముద్ర తీరంలో చైనా షిప్ కలకలం!!)

కాగా..ఇప్పటికే భారత్ లో కరోనా రోగుల సంఖ్య 29కి చేరిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా 98 వేల కేసులు నమోదు కాగా వారిలో 33వందల మంది కరోనా సోకి ప్రాణాలు కోల్పోయారు.