భారత్‌లో తొలి కరోనా మృతి.. డిక్లేర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

భారత్‌లో తొలి కరోనా మృతి.. డిక్లేర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

భారత్‌లో తొలి కరోనా మృతి నమోదైంది. కర్ణాటక వాసి హైదరాబాద్‌లో ట్రీట్మెంట్ తీసుకున్న వ్యక్తి.. చనిపోయినట్లు కర్ణాటక ప్రభుత్వం వెల్లడించింది. ఇదే భారత్‌లో నమోదైన తొలి కరోనా మృతి కావడం విచారకరం. కర్ణాటకలోని కలబుర్గికి చెందిన వ్యక్తి మరణంతోపాటు భారత్‌లో ఇప్పటివరకూ 74కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రజలు భయపడొద్దని తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు. 

ముందస్తు జాగ్రత్తగా 1500మందిని అబ్జర్వేషన్ లో ఉంచామని.. జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఢిల్లీలో మాట్లాడిన ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ట్రాన్స్‌పోర్ట్ సమయంలోనే జరుగుతుండటంతో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఎయిర్‌పోర్టులో 10లక్షల 57వేల 506మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

ఢిల్లీలో 6పాజిటివ్ కేసులు ఉండగా, ఉత్తరప్రదేశ్ లో 10, కర్ణాటకలో 4కేసులు, మహారాష్ట్రలో 11, లడఖ్‌లో 3, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, జమ్మూ అండ్ కశ్మీర్, పంజాబ్ ల నుంచి ఒక్కొక్క కేసు నమోదైంది. కేరళలో అత్యధికంగా 17కేసులు ఉన్నట్లు గుర్తించారు. కేరళలో చికిత్స్ పూర్తి అయి డిశ్చార్జ్ అయిన ముగ్గురికి 
 మరోసారి కరోనా రావడంతో మృత్యుభయంతో బతుకుతున్నారు. 

ఈ క్రమంలోనే బుధవారం WHOకరోనాను మహమ్మారిగా ప్రకటించింది. తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య శాఖకు సూచించింది.