చైనా,దక్షిణకొరియా కన్నా భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువ

  • Published By: venkaiahnaidu ,Published On : May 3, 2020 / 12:13 PM IST
చైనా,దక్షిణకొరియా కన్నా భారత్ లో కరోనా మరణాల రేటు తక్కువ

3.3శాతంతో ప్రపంచంలోనే కరోనా మరణాల రేటు అతితక్కువగా ఉన్న దేశంగా భారత్ నిలిచింది. కరోనా వైరస్ మొదటగా వెలుగులోకి వచ్చిన చైనా, ఆ తర్వాత వైరస్ వేగంగా వ్యాప్తి చెందిన దక్షిణ కొరియా దేశాలతో పోల్చితే మనదేశంలో కూడా మరణాల శాతం తక్కువగా ఉందని అధికారులు తెలిపారు. మొత్తం కన్ఫర్మ్ కేసులలో 3.3శాతం మంది మాత్రమే చనిపోయారని తెలిపారు.

కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో విజయం సాధించిన దక్షిణకొరియా,కరోనా మహమ్మారి వ్యాప్తిని పరిమితం చేసేందుకు మాస్ క్వారంటైన్ వంటి చర్యలు తీసుకున్న చైనాతో సహా ఇతర దేశాలతో పోల్చి చూస్తే… 1లక్ష మంది జనాభాకి 0.09 మంది మరణాలతో భారత్ మెరుగుగా నిలిచింది. ప్రారంభంలో కరోనా వైరస్ దక్షిణకొరియాపై విరుచుకుపడగా,మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్యను 10,780కి,మరణాల సంఖ్యను 250కి పరిమితం చేయడంలో దక్షిణకొరియా రికార్డు సాధించింది.

2.3శాతంతో ప్రపంచంలోనే మరణాల రేటు తక్కువగా ఉన్న ఒక దేశంగా సౌత్ కొరియా నిలిచింది. అయితే 1లక్ష జనాభాకి… చైనా 0.33,భారత్ 0.09 కన్నా 0.48 మరణాలతో దక్షిణకొరియా టాప్ లో నిలిచింది. మరోవైపు చైనా,దక్షిణకొరియాల,ఇతర ప్రధాన దేశాల కన్నా 0.09తో భారత్ లో మరణాల రేటు తక్కువగా ఉంది.  జాన్ హాప్కిన్స్ యూనివర్శిటీ తెలిపిన ప్రకారం…83,959కరోనా కేసులు,4,637మరణాలతో… 5.5శాతం మరణాల రేటు చైనాలో ఉంది.

భారత్ లో కరోనా కేసుల సంఖ్య 40వేలకు చేరుకోగా.. 1300కు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. మరోవైపు…అమెరికా,మరికొన్ని యూరప్ లో పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. 1లక్ష జనాభాకు 67.44శాతంతో బెల్జియంలో అత్యధిక కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా 3,496,707కరోనా కేసులు నమోదవగా..244,870మంది మరణించారు. అమెరికాలో అత్యధికంగా 67,448మంది కరోనాతో మరణించగా,1,160,996 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.