దేశంలో కొత్తగా 16,922 కరోనా కేసులు

  • Published By: vamsi ,Published On : June 25, 2020 / 04:56 AM IST
దేశంలో కొత్తగా 16,922 కరోనా కేసులు

దేశవ్యాప్తంగా రాష్ట్రాల మధ్య రాకపోకలు నడుస్తున్నాయి. సరిహద్దులు దాటితే క్వారంటైన్ కాకుండా హోం క్వారంటైన్ చాలు అంటుంది ప్రభుత్వం. ప్రభుత్వ ఆఫీసులు తెరుచుకున్నాయి. కొన్ని జాగ్రత్తలతో టీవీ షూటింగులు, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దాదాపు అన్నీ సడలింపులు వచ్చేశాయి. కొన్నింటికి మినహాయింపులు ఇచ్చింది ప్రభుత్వం. 

అయితే ప్రభుత్వం మినహాయింపులు ఇచ్చిన తర్వాత దేశంలో కొత్త కేసులు ఘననీయంగా పెరిగిపోతున్నాయి. భారతదేశంలో లేటెస్ట్ కరోనావైరస్ కేసులు గత 24 గంటల్లో, సుమారు 17 వేలకు దగ్గరగా నమోదయ్యాయి. అయితే ఈ కాలంలో వ్యాధి నుండి కోలుకుంటున్న రోగుల సంఖ్య పెరిగింది. గత 24గంటల్లో 13 వేలకు పైగా ప్రజలు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు. దేశంలో మొత్తం 4.73 లక్షల కరోనా వైరస్ రోగులు ఉండగా.. వీరిలో 1.86 లక్షలు క్రియాశీల కేసులు ఉన్నాయి. అదే సమయంలో ఇప్పటివరకు 14,894 మంది మరణించారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో గరిష్టంగా 16,922 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో 418 మంది చనిపోయారు. దేశంలో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 4 లక్షల 73 వేల 105కు పెరిగింది. ఇందులో 1,86,514 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 2,71,697 మంది ఆరోగ్యంగా మారగా, 14,894 మంది చనిపోయారు.

Read: లీటర్ డీజిల్ ధర రూ.80, ఢిల్లీలో పెట్రోల్ కన్నా డీజిల్ ప్రియం, కారణం ఇదే