India Corona : గుడ్ న్యూస్.. వరుసగా 2వ రోజు లక్షలోపే కరోనా కేసులు

దేశంలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. వరుసగా 2వ రోజూ రోజువారీ కేసులు లక్ష దిగువనే నమోదయ్యాయి.

India Corona : గుడ్ న్యూస్.. వరుసగా 2వ రోజు లక్షలోపే కరోనా కేసులు

India Corona

India Corona : ఇన్నాళ్లు ఉక్కిరిబిక్కిరి అయిన దేశ ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. క్రమంగా పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. దేశాన్ని వణికించిన కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. వరుసగా 2వ రోజూ రోజువారీ కేసులు లక్ష దిగువనే నమోదయ్యాయి. సుమారు 2 నెలల తర్వాత ఈ స్థాయి తగ్గుదల కనిపించింది. తాజాగా 92వేల 596 మందికి కరోనా సోకగా..2వేల 219 మంది చనిపోయారు. కాగా, క్రితం రోజుతో పోల్చితే కేసులు, మరణాల్లో స్వల్ప పెరుగుదల కనిపించింది.

మంగళవారం(జూన్ 8,2021) 19లక్షల 85వేల 967 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 92వేల 596 మందికి పాజిటివ్‌గా తేలింది. దేశంలో మొత్తం కేసులు 2.9 కోట్ల మార్కును దాటాయి. పాజిటివిటీ రేటు రెండో రోజు 5 శాతానికి దిగువనే నమోదైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించినట్టుగా 5 శాతం దిగువనే ఈ రేటు కొనసాగుతుండటం ఊరటనిచ్చే అంశం. ఇప్పటివరకు 3లక్షల 53వేల 528కి కరోనాతో చనిపోయారు. ఈ మేరకు బుధవారం(జూన్ 9,2021) కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా కేసులు, మరణాల వివరాలు తెలిపింది.

యాక్టివ్ కేసులు గణనీయంగా తగ్గుతుండగా, రికవరీ రేటు మెరుగవుతోంది. ప్రస్తుతం 12,31,415 మంది కొవిడ్‌తో బాధపడుతుండగా..క్రియాశీల రేటు 4.50 శాతానికి చేరింది. నిన్న ఒక్కరోజే 1,62,664 మంది కోలుకోగా..మొత్తం ఈ సంఖ్య 2.75కోట్లకు పైబడింది. రికవరీ రేటు 94.29 శాతానికి చేరింది.