వరుసగా 5వ రోజు 20వేలకు పైగా కేసులు.. 20వేల మార్క్ దాటిన మరణాలు

  • Published By: vamsi ,Published On : July 7, 2020 / 12:27 PM IST
వరుసగా 5వ రోజు 20వేలకు పైగా కేసులు.. 20వేల మార్క్ దాటిన మరణాలు

నేడు(07 జూలై 2020), వరుసగా ఐదవ రోజు, భారత్‌లో 20 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ కేసులలో భారతదేశం ప్రపంచంలో మూడవ స్థానానికి చేరుకుంది. కరోనా వైరస్ కేసులు భారత్‌లో వేగంగా పెరుగుతుండగా.. మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య ఏడు లక్షలు దాటింది.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. ఇప్పటివరకు 7 లక్షల 20 వేల మందికి కరోనా సోకింది. వీరిలో 20,160 మంది మరణించగా, నాలుగు లక్షల 40 వేల మంది కోలుకున్నారు. గత 24 గంటల్లో, 22 వేల 252 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 467 మరణాలు సంభవించాయి.

ప్రపంచంలో మూడవ అత్యంత ప్రభావిత దేశంగా భారత్:
భారతదేశం కరోనా విషయంలో మూడవ అత్యంత ప్రభావిత దేశంగా ప్రపంచంలో నిలిచింది. అమెరికా, బ్రెజిల్ తరువాత భారతదేశంలో ఒకే రోజులో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. భారతదేశం కంటే ఎక్కువ కేసులు అమెరికా (3,039,913), బ్రెజిల్ (1,626,071) లో ఉన్నాయి. అదే సమయంలో, రష్యా (687,862) నాల్గవ ప్లేస్‌లో ఉంది.

రాష్ట్రాలవారీగా గణాంకాలు:

క్రమ సంఖ్య రాష్ట్రం పేరు మొత్తం కరోనా కేసులు
కోలుకున్నవారు చనిపోయినవారు
1 అండమాన్ నికోబార్ 141 74 0
2 ఆంధ్రప్రదేశ్ 20019 8920 239
3 అరుణాచల్ ప్రదేశ్ 270 92 2
4 అస్సాం 12160 7882 14
5 బీహార్ 12125 8997 97
6 చండీగఢ్ 489 401 6
7 ఛత్తీస్గఢ్ 3305 2667 14
8 ఢిల్లీ 100823 72088 3115
9 గోవా 1813 1061 7
10 గుజరాత్ 36772 26315 1960
11 హర్యానా 17504 13335 276
12 హిమాచల్ ప్రదేశ్ 1077 763 11
13 జమ్మూ కాశ్మీర్ 8675 5318 138
14 జార్ఖండ్ 2847 2068 20
15 కర్ణాటక 25317 10527 401
16 కేరళ 5622 3341 27
17 లడఖ్ 1005 836 1
18 మధ్యప్రదేశ్ 15284 11579 617
19 మహారాష్ట్ర 211987 115262 9026
20 మణిపూర్ 1390 734 0
21 మేఘాలయ 80 43 1
22 మిజోరం 197 133 0
23 ఒడిషా 9526 6486 38
24 పుదుచ్చేరి 802 331 12
25 పంజాబ్ 6491 4494 169
26 రాజస్థాన్ 20688 16278 461
27 తమిళనాడు 114978 66571 1571
28 తెలంగాణ 25733 14781 306
29 త్రిపుర 1680 1219 1
30 ఉత్తరాఖండ్ 3161 2586 42
31 ఉత్తర ప్రదేశ్ 28636 19109 809
32 పశ్చిమ బెంగాల్ 22987 15235 779
భారతదేశంలో మొత్తం రోగుల సంఖ్య 719665 439948 20160

క్రియాశీల కేసుల్లో టాప్ -5 రాష్ట్రాలు:

గణాంకాల ప్రకారం దేశంలో ప్రస్తుతం 2 లక్షల 59 వేల కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. అత్యంత చురుకైన కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి. మహారాష్ట్రలో 87 వేలకు పైగా సోకిన ప్రజలు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. తమిళనాడు రెండో స్థానంలో, ఢిల్లీ మూడో స్థానంలో, గుజరాత్ నాలుగవ స్థానంలో, ఉత్తర ప్రదేశ్ ఐదవ స్థానంలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో అత్యంత చురుకైన కేసులు ఉన్నాయి.

Read Here>>నియాండర్తల్స్ మానవులలో కరోనా వైరస్ మూలం?