Coronavirus Live Updates : కోవిడ్ వ్యాక్సిన్ల ఎగుమతిపై భారత్ ఎలాంటి నిషేధం విధించలేదు

దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ల అవసరం ఎంతైనా ఉంది. కానీ, కోవిడ్-19 వ్యాక్సిన్ల ఎగుమతిపై నిషేధం విధించారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది.

Coronavirus Live Updates : కోవిడ్ వ్యాక్సిన్ల ఎగుమతిపై భారత్ ఎలాంటి నిషేధం విధించలేదు

Coronavirus Live Updates (2)

Coronavirus live updates : దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ల అవసరం ఎంతైనా ఉంది. కానీ, కోవిడ్-19 వ్యాక్సిన్ల ఎగుమతిపై నిషేధం విధించారంటూ వస్తున్న వార్తలపై కేంద్ర ప్రభుత్వం మరోసారి క్లారిటీ ఇచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ల ఎగుమతిపై ఎలాంటి నిషేధం లేదంటూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. సీరమ్ ఇన్సిట్యూట్ నుంచి కెనడాకు కరోనా వైరస్ వ్యాక్సిన్ల తరలింపును భారత్ నిలిపివేసిందంటూ ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది.

దేశీయంగా కరోనా వ్యాక్సిన్ల అవసరం మేరకు తాత్కాలిక వ్యవధి వరకు వ్యాక్సిన్ల ఎగుమతి నిలిపివేసినట్టు నివేదికలో పేర్కొంది. దేశీయంగా కరోనా కేసులు పెరగడంతో ఢిల్లీ ఇమ్యూనైజేషన్ కోసం అవసరమైన స్పూత్నిక్ వ్యాక్సిన్ల లభ్యత కోసం కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు నివేదిక తెలిపింది. వ్యాక్సిన్ డోసుల తరలింపు కాస్తా ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోందని అధికారి ఒకరు వెల్లడించారు.

వ్యాక్సిన్ డోసులు ఎప్పుడూ అందుబాటులోకి వస్తాయనేది ఇంకా సమాచారం లేదని తెలిపారు. ఫిబ్రవరిలో కెనడాతో సీరమ్ వ్యాక్సిన్ల డోసులు పంపేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం.. ఇప్పటికే అవసరమైన మేరకు వ్యాక్సిన్ డోసులు కెనడాకు చేరుకున్నాయి. మే మధ్యనెలలో 1.5 మిలియన్ వ్యాక్సిన్ల డోసులను ఇంకా కెనడా అందుకోవాల్సి ఉంది. గతనెలలో స్పూత్నిక్ 5లక్షల డోసులను అందించినట్టు నివేదిక వెల్లడించింది.

దేశంలో 24 గంటల వ్యవధిలో 81,466 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో ఆరు నెలల్లో ఒకేరోజు భారీగా కేసుల సంఖ్య నమోదైంది. 2020 అక్టోబర్ 2 నుండి 81,484 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది.