మహారాష్ట్రలో 690కి చేరిన కరోనా కేసులు…దేశంలో 20శాతం కేసులు ఇక్కడే

  • Published By: venkaiahnaidu ,Published On : April 5, 2020 / 12:37 PM IST
మహారాష్ట్రలో 690కి చేరిన కరోనా కేసులు…దేశంలో 20శాతం కేసులు ఇక్కడే

మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య కంటిన్యూస్ గా పెరుగుతోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 690కి చేరిందని మహారాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే తెలిపారు. దేశంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదైన రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. దేశఆర్థిక రాజధాని ముంబైలో కొత్తగా 29 కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు.

కొత్తగా రాష్ట్రంలో 55కేసులను గుర్తించినట్లు తెలిపారు. మరోవైపు 56మంది కరోనా దెబ్బ నుంచి కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారని ఆయన తెలిపారు.కరోనా వైరస్ వ్యాప్తి యొక్క హాట్ స్పాట్ గా మహారాష్ట్ర మారిందని,దేశంలోని 20శాతం కరోనా పేషెంట్లు మహారాష్ట్రలోనే ఉన్నారని కేంద్రఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లావ్ అగర్వాల్ తెలిపారు.

మరోవైపు దేశంలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3వేల 374 కరోనా కేసులు నమోదయ్యాయని లావ్ అగర్వాల్ ఆదివారం తెలిపారు. ఇప్పటివరకు దేశంలో 79 కరోనా మరణాలు నమోదైనట్లు తెలిపారు. గడిచిన 24గంటల్లో 472 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయని అగర్వాల్ తెలిపారు. దేశంలోని మొత్తం 736 జిల్లాల్లో…274 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలిపారు. ఆదివారం వరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 30శాతం కేసులు ఢిల్లీలోని నిజాముద్దీన్ లో గత నెలలో జరిగిన తబ్లిగీ జమాత్ కార్యక్రమంలో పాల్గొన్నవారేనని లావ్ అగర్వాల్ తెలిపారు.