ఒక్కరోజులోనే 90వేల మార్క్‌కు చేరిన కరోనా కేసులు

  • Published By: vamsi ,Published On : May 17, 2020 / 04:27 AM IST
ఒక్కరోజులోనే 90వేల మార్క్‌కు చేరిన కరోనా కేసులు

భారత దేశంలో కరోనావైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4,987 పాజిటివ్‌ కేసులు, 124మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 90,927కి చేరుకుంది. 85వేల మార్క్ దాటిన ఒక్క రోజులోనే 90వేల మార్క్‌కు చేరుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

అయితే అందులో 34,109 మంది మాత్రం వ్యాధి నుంచి కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 53,946  మంది చికిత్స పొందుతున్నారు. చనిపోయినవారి సంఖ్య 2,872కి చేరింది. అత్యధిక మరణాలు మహారాష్ట్రలో ఉండగా.. చైనాను కూడా దాటేసి భారత్‌లో కేసులు 90వేలకు చేరడంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 

భారతదేశం కంటే ఎక్కువ కేసులు ఉన్న పది దేశాలు.. యునైటెడ్ స్టేట్స్ , రష్యా, యునైటెడ్ కింగ్‌డమ్, స్పెయిన్ , ఇటలీ , బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, టర్కీ మరియు ఇరాన్. ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య 4.5 మిలియన్లు దాటిపోయింది.