కరోనా అనుమానంతో వలస కూలీలపై స్ప్రే చేసే కెమికల్స్ ఏంటి? అవి సురక్షితమేనా?

కరోనా అనుమానంతో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీలపై ఉత్తరప్రదేశ్ లో అధికారులు కెమికల్స్ స్ప్రే చేసిన సంగతి తెలిసిందే. వలస కూలీలను రోడ్డుపై కూర్చోపెట్టిన

  • Published By: veegamteam ,Published On : March 31, 2020 / 10:22 AM IST
కరోనా అనుమానంతో వలస కూలీలపై స్ప్రే చేసే కెమికల్స్ ఏంటి? అవి సురక్షితమేనా?

కరోనా అనుమానంతో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీలపై ఉత్తరప్రదేశ్ లో అధికారులు కెమికల్స్ స్ప్రే చేసిన సంగతి తెలిసిందే. వలస కూలీలను రోడ్డుపై కూర్చోపెట్టిన

కరోనా అనుమానంతో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన కూలీలపై ఉత్తరప్రదేశ్ లో అధికారులు కెమికల్స్ స్ప్రే చేసిన సంగతి తెలిసిందే. వలస కూలీలను రోడ్డుపై కూర్చోపెట్టిన అధికారులు పైపులతో వారిపై రసాయనాలు పిచికారీ చేశారు. ఇలా చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అమానుషం, దారుణం అని మండిపడుతున్నారు. వాళ్లు మనుషులు అనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. సాటి మనుషులతో ప్రవర్తించేది ఇలానేనా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వలస కూలీలపై కెమికల్స్ స్ప్రే చేయడం దుమారం రేపింది. కాగా, వలస కూలీలపై చల్లిన కెమికల్స్ ఏంటి? ఎలాంటి రసాయనాలు వినియోగించారు? అవి సురక్షితమేనా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వలస కూలీలపై చల్లిన రసాయనంలో వాడిన ద్రావణం పేరుని అధికారులు తెలిపారు. అది సోడియం హైపోక్లోరైట్ ద్రావణం(sodium hypochlorite) అని చెప్పారు. సోడియం హైపోక్లోరైట్‌ను సాధారణంగా బ్లీచింగ్ ఏజెంట్‌గా ఉపయోగిస్తారు. ఈత కొలనులను(స్విమ్మింగ్ పూల్స్) శుభ్రపరచడానికి కూడా వాడతారు. కేవలం 1శాతం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని వినియోగించామని, కాబట్టి పెద్ద ప్రమాదమేమీ లేదని అధికారులు అంటున్నారు. ఇక ఇదే రసాయనాన్ని గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ లలో కూడా ఉపయోగిస్తున్నారు. కరోనావైరస్ ను క్లీన్ చేసే ప్రయత్నంలో భాగంగా భవనాలు, ఘన ఉపరితలాలను ఈ ద్రావణంతోనే శుభ్ర పరుస్తున్నారు.

సోడియం హైపోక్లోరైట్‌ సురక్షితమేనా?
సాధారణంగా బ్లీచింగ్ ఏజెంట్‌గా సోడియం హైపోక్లోరైట్‌ను వాడతారు. శుభ్రపరిచేందుకు, క్రిమిసంహారక ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. ఇది క్రిమిసంహారక మందు అయిన క్లోరిన్ ను విడుదల చేస్తుంది. ద్రావణంలో రసాయన సాంద్రత దాని ఉద్దేశ్యం ప్రకారం మారుతుంది. పెద్ద మొత్తంలో క్లోరిన్ ఉంటే హానికరం. ఇళ్లలో వాడే బ్లీచ్ లో 2-10% సోడియం హైపోక్లోరైట్ ఉంటుంది. శరీరంపై గాయాలు, చర్మ గాయాలకు చికిత్స చేయడానికి 0.25-0.5% కంటే తక్కువ మోతాదులో వాడతారు. హ్యాండ్ వాష్ కైతే 0.05% మాత్రమే ఉపయోగించబడుతుంది.

కాగా, ఒక శాతం సోడియా హైపోక్లోరైట్ సొల్యూషన్ హానికరం అని నిపుణులు తేల్చారు. చర్మానికి హాని కలిగిస్తుందన్నారు. ఇది శరీరం లోపలికి వెళితే, అది ఊపిరితిత్తులకు తీవ్రమైన హాని కలిగిస్తుందన్నారు. సోడియం హైపోక్లోరైట్ హార్డ్ ఉపరితలాలను శుభ్రపరచడానికి వాడతారు. మనుషులపై ఉపయోగించడానికి సిఫారసు చేయలేదు. కూలీలపై స్ప్రే చేసిన రసాయనంలో కేవలం 1శాతం సోడియం హైపోక్లోరైట్ మాత్రమే వాడామని అధికారులు చెబుతున్నా.. అది చాలా ప్రమాదకరం అని నిపుణులు అంటున్నారు. కళ్లకు హాని జరిగే ప్రమాదం ఉందన్నారు. కంటి చూపు పోవచ్చన్నారు.

సోడియం హైపోక్లోరైట్ కరోనావైరస్ ను చంపుతుందా?
ప్రపంచ ఆరోగ్య సంస్థ, యుఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏం చెప్పిందంటే..  కరోనావైరస్ ఉనికిని తొలగించడానికి, కఠినమైన ఉపరితలాలను శుభ్రం చేయడానికి హైపోక్లోరైట్ ద్రావణం ఉపయోగపడుతుందని చెప్పింది. 2 నుంచి 10శాతం గాడత ఉండాలంది. ఈ ద్రావణం ద్వారా కఠినమైన ఉపరితలాలను శుభ్రపరచడమే కాకుండా కరోనావైరస్ ఉనికిని తొలగిస్తుందన్నారు. అంతేకాదు “ఫ్లూ, ఆహార సంబంధ అనారోగ్యాలు నివారించడంలో సహాయపడుతుంది” అని చెప్పారు. అయితే “బాగా వెంటిలేషన్ ఉన్న ప్రదేశంలో మాత్రమే బ్లీచ్‌ను వాడాలి. కచ్చితంగా హ్యాండ్ గ్లోవ్స్ వాడాలి. లేదంటే చాలా ప్రమాదం అని నిపుణులు హెచ్చరించారు.