రోడ్డెక్కిన కరోనా పేషెంట్లు..వణికిపోయిన నగరవాసులు

  • Published By: nagamani ,Published On : July 24, 2020 / 04:45 PM IST
రోడ్డెక్కిన కరోనా పేషెంట్లు..వణికిపోయిన నగరవాసులు

కరోనా వైరస్ పేరు వింటేనే జనాలు ఆమడ దూరం పరిగెడుతున్నారు. కళ్లముందే తోటి మనిషి చచ్చిపోతున్నా..కళ్లతో చూస్తుండిపోతున్నారు తప్ప ముట్టుకునే సాహసం చేయట్లేదు. అటువంటిది ఏకంగా క్వారంటైన్ సెంటర్ లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్లు రోడ్డుపైకి గుంపులు గుంపులుగా వచ్చేశారు. మరి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి..!!కరోనా ఉందని తెలిస్తే చాలు లాక్కెళ్లి క్వారంటైన్ సెంటర్లో పడేస్తున్నారు. అటువంటిది ఏకంగా క్వారంటైన్ సెంటర్ నుంచే కరోనా పేషెంట్లు రోడ్డుమీదకు వచ్చేస్తే పరిస్థితి వచ్చింది.

తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో అదే జరిగింది. ముత్తుకుమారన్ మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్లో ఉంటున్న కొందరు కరోనా వైరస్ బాధితులు రోడ్లపైకి వచ్చి ధర్నాకు దిగారు. దీంతో అక్కడే కొంతమంది ప్రజలు పరుగులు పెట్టుకుంటూ పారిపోయారు. ఇంతకీ వారురోడ్డుమీదకు ఎందుకొచ్చారంటే..

క్వారంటైన్ సెంటర్ లో ఆహారం, సరైన వైద్యం కల్పించకపోవడం వారి ధర్నాకు దిగారు. కనీసం తాగటానికి నీళ్లు కూడా సమకూర్చటంలేదంటూ మండిపడ్డారు. కరోనా వచ్చిన మాకు తినటానికి తిండి తాగటానికి నీళ్లు కూడా ఇవ్వకుండా చంపేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.సరైన వైద్యం చేయట్లేదంటూ ఆందోళన చేపట్టారు. వారి వద్దకు వచ్చిన పోలీసులు వారికి సర్ధి చెప్పి సరైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇవ్వటంతో వారు శాంతించి క్వారంటైన్ సెంటర్ కు వెళ్లిపోయారు.

కాగా..తమిళనాడులో కరోనా వైరస్ కేసుల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,472 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,92,964కి చేరింది. ఒక్కరోజులో 88 కరోనా మరణాలు సంభవించడం గమనార్హం. కరోనాతో ఇప్పటివరకు 3,232 మంది మరణించారు. ఇప్పటివరకు కరోనా నుంచి 1,36,793 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా… ప్రస్తుతం రాష్ట్రంలో 52,939 యాక్టివ్ కేసులు ఉన్నాయి.