పూణె నర్సుకు మోడీ కాల్.. మీ సేవలు అమోఘమని ప్రశంసలు

పూణె నర్సుకు మోడీ కాల్.. మీ సేవలు అమోఘమని ప్రశంసలు

ప్రధాని నరేంద్ర మోడీ పూణెలోని నర్సుకు ఫోన్ చేశారు. కొవిడ్-19కు చికిత్స అందిస్తున్న నాయుడు హాస్పిటల్ లో పనిచేస్తుంది నర్స్ చాయా జగతప్‌. మహమ్మారి బారిన పడితే ప్రాణాలు కోల్పోతామని భయపడుతుంటే ఆవిడ వృత్తిపై ఉన్న భక్తితో సేవలు అందిస్తూనే ఉన్నారు. కుటుంబ సభ్యులు ఆమె భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఆమె రోగులకు నిర్విరామంగా సేవలు అందిస్తున్నారు. ఆమె సేవల గురించి తెలుసుకుని శుక్రవారం సాయంత్రం మోడీ ఫోన్ చేసి మరాఠీలో మాట్లాడి ప్రశంసించారు.

‘అవును నా కుటుంబం గురించి ఆలోచిస్తే బాధగానే ఉంది. కానీ, ఇలాంటి సమయంలో తప్పక పనిచేయాలి. నేను మేనేజ్ చేయగల్గుతున్నాను’ అని చెప్పింది. ఆ తర్వాత ప్రధాని హాస్పిటల్లో చేరిన పేషెంట్లు భయపడుతున్నారా అని అడగ్గా ఇలా సమధానమిచ్చింది. ‘వాళ్లతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాం. వారికి భయపడొద్దని చెబుతున్నాం. ఏం జరగదని త్వరలోనే రిపోర్టులు నెగెటివ్‌గానే వస్తాయని నమ్మకమిస్తున్నాం’ అని చెబుతున్నాం. 

పేషెంట్లను మోరల్ గా సిద్ధం చేసి ధైర్యం నింపేందుకు ప్రయత్నిస్తున్నాంమని ఆమె ఫోన్ లో చెప్పారు. ఇప్పటికే ఏడుగురు హాస్పిటల్ నుంచి కోలుకుని బయటపడినట్లు ప్రధానికి తెలియజేశారు. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా హాస్పిటళ్లలో పనిచేస్తున్న లక్షల్లో స్టాఫ్ కు ఏదైనా మెసేజ్ ఇస్తారా అని ప్రధాని ఆమెను అడిగారు. దానికి ఆమె ‘భయపడాల్సిన అవసర్లేదు. మన దేశాన్ని గెలిపించేందుకు ప్రయత్నిస్తున్నాం. హాస్పిటల్, సిబ్బంది ముఖ్య ఉద్దేశ్యమిదే’ అని అన్నారు. ఆమె భక్తికి, సర్వీసుకు ప్రధాని కంగ్రాట్స్ తెలియజేశారు. 

మీలాగే లక్షల మంది నర్సులు, పారా మెడికల్ స్టాఫ్, డాక్టర్లు, తపస్సు చేస్తున్నట్లుగా పనిచేస్తున్నారు. కరోనా పేషెంట్లకు సేవలు అందిస్తున్నారు. మీ అందరికీ కంగ్రాట్స్ చెబుతున్నా. మీ అనుభవాలను విని నేను సంతోషపడుతున్నా’ అని ప్రధాని అన్నారు.

దానికి ఔన్నత్యంతో ‘నేను కేవలం నా డ్యూటీ మాత్రమే చేస్తున్నాను. మీరు దేశాన్ని కాపాడేందుకు 24గంటలు పనిచేస్తున్నారు. మిమ్మల్ని చూసి గర్విస్తున్నాను’ అని పొగిడింది. ఇలాంటి ప్రధాని ఉండటం మన దేశం చేసుకున్న అదృష్టమని ఆ ఆడియోలో చెప్పింది. ఈ సంభాషణను అందరూ మెడికల్ స్టాఫ్ కు ఫార్వార్డ్ చేసి స్థైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.