ముఖ్యమంత్రి ఇంట్లో కరోనా.. మేనకోడలికి పాజిటివ్.. హోం క్వారంటైన్‌లో కుటుంబం

  • Published By: vamsi ,Published On : July 7, 2020 / 01:29 PM IST
ముఖ్యమంత్రి ఇంట్లో కరోనా.. మేనకోడలికి పాజిటివ్.. హోం క్వారంటైన్‌లో కుటుంబం

చిన్నా, పెద్దా అనే తేడా లేదు.. ధనిక, బీద అనే తారతమ్యం లేదు.. కరోనా దేశమంతా వ్యాపిస్తుంది. దేశంలో రోజురోజుకు కేసులు పెరుగుతుండగా.. లేటెస్ట్‌గా బీహార్ ముఖ్యమంత్రి నివాసంలో కరోనా వైరస్ ప్రవేశం జరిగింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మేనకోడలు కరోనా పాజిటివ్‌గా తేలింది. పాట్నాలోని ఎయిమ్స్‌లో ఆమెకు చికిత్స అందుతుంది.

బీహార్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే కరోనా వైరస్ ముఖ్యమంత్రి నివాసంలోకి ప్రవేశించింది. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మేనకోడలు కరోనా పాజిటివ్ కాగా.. కుటుంబం మొత్తాన్ని ఇంటి నిర్బంధంలో ఉంచారు. అందరికీ పరీక్షలు చేస్తున్నారు.

సీఎం నితీష్ కుమార్ మేనకోడలు కూడా సీఎం ఇంట్లోనే నివసిస్తున్నారు. విషయం తెలుసుకున్న తర్వాత మొత్తం సీఎం ఇల్లు శుభ్రపరిచారు. మిగిలిన కుటుంబ సభ్యులను ఇంటిలో నిర్బంధించారు. అయితే, సీఎం నితీష్ కుమార్‌కు ఇంటి నిర్బంధమా లేదా? ఇది నివేదించబడలేదు. సిఎం నితీష్ కుమార్ జూలై 4వ తేదీన కరోనా పరీక్ష చేయించుకున్నారు, ఈ నివేదిక ప్రతికూలంగా వచ్చింది.

Read Here>>సర్టిఫికెట్ కోసం : 70 కి.మీ సైకిల్ తొక్కుకుంటూ కలెక్టర్ ఆఫీసుకు వెళ్లిన 73 ఏళ్ల దివ్యాంగ వృద్ధుడు