ఆసుపత్రి నుంచి పారిపోయిన మహిళకు కరోనా పాజిటివ్, హనిమూన్ నుంచి రాగానే బయటపడిన వైరస్

మూడు రోజుల క్రితం ఆగ్రాలోని ఆసుపత్రి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన మహిళకు రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె భర్తకి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం

  • Edited By: veegamteam , March 17, 2020 / 03:14 AM IST
ఆసుపత్రి నుంచి పారిపోయిన మహిళకు కరోనా పాజిటివ్, హనిమూన్ నుంచి రాగానే బయటపడిన వైరస్

మూడు రోజుల క్రితం ఆగ్రాలోని ఆసుపత్రి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన మహిళకు రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె భర్తకి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం

మూడు రోజుల క్రితం ఆగ్రాలోని ఆసుపత్రి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన మహిళకు రిపోర్టులో కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె భర్తకి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం అతడు బెంగళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటివరకు తాజ్ సిటీలో 7 కరోనా పాజిటివ్ కేసులో నమోదు కాగా, ఐదుగురు కోలుకున్నారు. మరో ఇద్దరిలో ఈ మహిళ ఒకరు. వీరిద్దరికి చెందిన 20 మందిని అధికారులు క్వారంటైన్ లో ఉంచారు. వారికి కరోనా టెస్టులు చేస్తున్నారు. 

బాధితురాలు తన భర్తతో కలిసి హనిమూన్ కి యూరప్ వెళ్లింది. ఇటీవలే తిరిగి వచ్చారు. ముంబైలో ల్యాండ్ అయ్యారు. అక్కడి నుంచి ఆ జంట బెంగళూరు వెళ్లింది. ఆమె భర్త బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్. అతడు కరోనా బారిన పడ్డాడు. అతడికి పాజిటివ్ అని వచ్చింది. ఆ వెంటనే అతడిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.
భర్తకు కరోనా అని తేలడంతో భార్య బెంగళూరు నుంచి ఢిల్లీ వెళ్లింది. ఆ తర్వాత తల్లిదండ్రులకు దగ్గరికి వెళ్లింది. కాగా, ఆ మహిళకు కరోనా టెస్టులు చేసేందుకు అధికారులు మార్చి 12న ప్రయత్నించారు. అయితే ఆమె వారికి సహకరించలేదు. ఎలాగో రక్త నమూనాలు సేకరించిన అధికారులు ల్యాబ్ కి పంపారు. రిపోర్టులో పాజిటివ్ అని రావడంతో ఆమెని ఆదివారం(మార్చి 15,2020) ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

See Also | కరోనా ఎఫెక్ట్ : సెలవుపై వెళ్లిన గవర్నర్..ప్రభుత్వం అసహనం 

మరో వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో అధికారులు అతడికి ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. అతడి కుటుంబసభ్యులు 11మందిని క్వారంటైన్ లో ఉంచారు. ఆగ్రాలో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 5 మంది ట్రీట్ మెంట్ తర్వాత కోలుకున్నారు. వారిని ఇళ్లకు పంపేశారు. 

కరోనా బారిన పడ్డ మహిళ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. అతడిపై అధికారులు సెక్షన్ 269(చట్టవిరుద్ధంగా లేదా నిర్లక్ష్యంగా ఏదైనా చర్య చేయడం, మరియు అతనికి తెలిసిన ఏదైనా వ్యాధి యొక్క సంక్రమణను జీవితానికి ప్రమాదకరమైనదిగా వ్యాప్తి చేసే అవకాశం ఉంది), సెక్షన్ 270(ప్రాణాంతక చర్య జీవితానికి ప్రమాదకరమైన వ్యాధి సంక్రమణను వ్యాప్తి చేస్తుంది) కింద కేసు నమోదు చేశారు. కూతురికి కరోనా సోకిన విషయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులను తప్పుదోవ పట్టించారని అధికారులు ఆయనపై ఈ కేసులు నమోదు చేశారు. ఆ వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు.

కరోనా విషయంలో అధికారులను తప్పుదోవ పట్టించిన వ్యవహారంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దేశంలో ఇదే తొలి కేసు అని అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ నిరోధానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్-1987 అమల్లోకి తెచ్చిన తర్వాత నమోదైన తొలి కేసు ఇదే.