కరోనా భయం.. కేంద్రమంత్రి మురళీధరన్ గృహ నిర్భందం

  • Published By: venkaiahnaidu ,Published On : March 17, 2020 / 07:41 AM IST
కరోనా భయం.. కేంద్రమంత్రి మురళీధరన్ గృహ నిర్భందం

కరోనా వైరస్ నేపథ్యంలో కేంద్రమంత్రి మురళీధరన్ తనకు తానుగా క్వారంటైన్ అయ్యారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకూడదని,ఢిల్లీలోని తన అధికారిక నివాసనం నుంచే తన కార్యకలాపాలు కొనసాగించాలని ఆయన నిర్ణయించుకున్నారట. అయితే కరోనా వైరస్ సోకినట్లు ఇప్పటివరకు తేలకపోయినప్పటికీ మంత్రిగారు ఇంటికే పరిమితమవడం వెనుక ఓ కారణం ఉంది.

కేరళకు చెందిన మురళీధరన్..మార్చి-14న తిరువనంతపురంలోని పేరుపొందిన శ్రీ చిత్ర తిరునాల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ(SCTIMST)లోని డైరక్టర్స్ ఆఫీస్ లో జరిగిన ఓ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ మీటింగ్ లో వివిధ డిపార్ట్మెంట్ ల హెడ్ లు పాల్గొన్నారు. అయితే మార్చి-1న స్పెయిన్ నుంచి తిరిగొచ్చిన ఈ హాస్పిటల్ లోని ఓ డాక్టర్(రేడియాలజిస్ట్)కు కరోనా సోకినట్లు ఆదివారం నిర్థారణ అయింది. మార్చి5వరకు ఆ డాక్టర్ హాస్పిటల్ లో పనిచేశాడు. 

See Also | వేసవిలోనూ కరోనా బతికే ఉంటుంది, శీతాకాలంలో మళ్లీ వస్తుంది

అప్పటివరకు ఆయనలో కరోనా లక్షణాలు కనుబడలేదు. అయితే ఆదివారం ఆయనకు టెస్ట్ లలో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో హాస్పిటల్ ను షట్ డౌన్ చేశారు. ఈ నేపథ్యంలో ఆరు ముఖ్యమైన డిపార్మెంట్లకు హెడ్ లుగా ఉన్న ఈ హాస్పిటల్ లోని డాక్టర్లు వాళ్లకు వాళ్లుగా ఇళ్లల్లోనే క్వారంటైన్(దిగ్భందనం)అయ్యారు. కరోనా సోకిన డాక్టర్ ను నేరుగా కలిసిన 25మంది డాక్టర్లతో సహా 75మంది ఉద్యోగుల లిస్ట్ ను తయారు చేసి వారిని ఐసొలేట్ చేసినట్లు సమాచారం. వాళ్ల కుటుంబసభ్యులను కూడా ఇళ్లల్లోనే ఉండమని అధికారులు సూచించినట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో తనకు ఇప్పటివరకు వైరస్ సోకినట్లు తేలకపోయినప్పటికీ కూడా తాను కూడా ఆ హాస్పిటల్ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నందున ముందు జాగ్రత్త చర్యగా తనకు తాను గా క్వారంటైన్ అయ్యారు కేంద్రమంత్రి మురళీధరన్. ఇళ్లు దాటి బయటకి రాకూడదని ఆయన నిర్ణయించారు.