IIT Kanpur : మే నెల జరభద్రం, కరోనా ఉధృతంగా ఉండనుంది – ఐఐటీ కాన్పూర్

కరోనా వైరస్ తో ప్రజలు భయకంపితులవుతున్నారు. తగ్గుముఖం పడుతుందనుకున్న క్రమంలో..మళ్లీ వైరస్ పంజా విసురుతుండడంతో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.

IIT Kanpur : మే నెల జరభద్రం, కరోనా ఉధృతంగా ఉండనుంది – ఐఐటీ కాన్పూర్

Red Zone

Coronavirus Second Wave; : కరోనా వైరస్ తో ప్రజలు భయకంపితులవుతున్నారు. తగ్గుముఖం పడుతుందనుకున్న క్రమంలో..మళ్లీ వైరస్ పంజా విసురుతుండడంతో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వచ్చే నెల మొదటి వారంలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉండనుందని ఐఐటీ కాన్పూర్ వెల్లడించింది. ఈ విషయం తమ పరిశోధనలో వెల్లడైందని, ఈ కాలంలో చాలా మంది కరోనా వైరస్ కు గురవుతారని వెల్లడించారు. ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ పద్మ శ్రీ మనీంద్ర అగర్వాల్ నేతృత్వంలో ఈ అధ్యయనం కొనసాగింది.

దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వ్యాప్తి చెందుతున్న కరోనా సగటు కేసులను అధ్యయనం చేసింది. గత వారం రోజుల వరకు ఈ అధ్యయనం చేపట్టారు. మహారాష్ట్రలో కేసులు తగ్గుముఖం పట్టగా..ఏడు రాష్ట్రాల్లో కేసులు ఎక్కువవుతున్నాయి. మహారాష్ట్రలో రాబోయే కొద్ది రోజుల్లో కేసులు పూర్తిగా తగ్గిపోతాయని, ఇదే సమయంలో ఉత్తర్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఏప్రిల్ 20 – 30 మధ్య గరిష్టంగా కరోనా వ్యాప్తి ఉంటుందని తెలిపింది.

కంప్యూటర్ ఆధారిత మోడల్ నుంచి సేకరించిన డేటా ప్రకారం..యూపీలో ఒకేరోజు గరిష్టంగా 32 వేల మంది, బీహార్ లో 9 వేలు, ఢిల్లీలో 30 వేలు, రాజస్థాన్ లో 10 వేలు, వెస్ట్ బెంగాల్ లో దాదాపు 11 వేల కేసులు నమోదయ్యాయి. అయితే..కుంభమేళా, ఎన్నికల ర్యాలీలు కరోనా వైరస్ పెరిగేందుకు ప్రభావం చూపవని వీరి అధ్యయనం వెల్లడిస్తోంది. మే 06వ తేదీ నాటికి తమిళనాడు రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తుందని, అయితే..ఈ డేటా ఇంకా పూర్తిగా స్పష్టంగా తెలియదని వెల్లడిస్తున్నారు. బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కేసులు పెరగడానికి ఎన్నికల సభలు, ర్యాలీలని కారణాలు చెప్తున్నవారు.. మహారాష్ట్ర, ఢిల్లీలో ఏ కారణాలు చెప్తారని ప్రోఫెసర్‌ అగర్వాల్ ప్రశ్నిస్తున్నారు.

Read More : India’s COVID Cases : కరోనా కల్లోలం, భారతదేశంలో భయానక పరిస్థితులు..వణికిపోతున్న రాష్ట్రాలు