Corona Symptoms : జ్వరం వస్తే కరోనా కాదు.. అసలు లక్షణాలు ఏంటి? వైద్యనిపుణులు ఏమంటున్నారు?

భారతదేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా మూడోవ్ వేవ్ నేపథ్యంలో ఒకవైపు ఒమిక్రాన్ కేసులు.. మరోవైపు చలితీవ్రతతో అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.

Corona Symptoms : జ్వరం వస్తే కరోనా కాదు.. అసలు లక్షణాలు ఏంటి? వైద్యనిపుణులు ఏమంటున్నారు?

Coronavirus Symptoms What Is Flu Fever And Covid Fever, These Are Most Infectious Covid 19 Symptoms, You Must Know

Coronavirus Symptoms : భారతదేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. కరోనా మూడోవ్ వేవ్ నేపథ్యంలో ఒకవైపు ఒమిక్రాన్ కేసులు.. మరోవైపు చలితీవ్రతతో అనేక అనారోగ్య సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జలుబు, దగ్గు, జ్వరం లాంటి సాధారణ అనారోగ్య సమస్యలు కూడా అధికమవుతున్నాయి. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఒమిక్రాన్ కేసుల తీవ్రత కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ఇలాంటి కరోనా పరిస్థితుల్లో ఏ చిన్న జ్వరం, జలుబు, దగ్గు, తుమ్ములు వచ్చినా భయాందోళనకు గురవుతున్నారు. అది కరోనా కావొచ్చుననే అనుమానం, ఆందోళనే ఎక్కువగా కనిపిస్తోంది. సాధారణ ఫ్లూ లక్షణాలకు.. కరోనా లక్షణాలకు తేడా ఏంటో తెలియక సతమతమైపోతున్నారు. అసలు కరోనా లక్షణాలు ఏంటి? ఎలా ఉంటాయి.. ఏ విధంగా గుర్తించాలి అనే విషయాలపై వైద్యనిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దాం..

సాధారణంగా శరీరంలోకి ఏదైనా ఫ్లూ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ సోకితే.. ముందుగా జలుబు.. ఆ తర్వాత జ్వరం వస్తుంది.. క్రమంగా దగ్గు ఇతర లక్షణాలు మొదలవుతాయని సీనియర్ ఫిజీషియన్ డాక్టర్ అజయ్ కుమార్ వివరించారు. జ్వరం వచ్చిందంటే కరోనా వచ్చిందని అనుకోవద్దని సూచించారు. ఫ్లూ జ్వరం.. కొవిడ్ జ్వరం ఒకే లక్షణాలను పోలి ఉండటంతో కన్ఫ్యూజన్ ఎదురవుతోందని తెలిపారు. మీకు ఇతర ఏ లక్షణాలు లేకుండా కేవలం జ్వరం మాత్రమే ఉంటే.. అది కరోనా కానక్కర్లేదని గుర్తించుకోండి.. దీనికి వెంటనే కరోనా టెస్టు చేయించుకోవాల్సిన అవసరం లేదు. జ్వరంతో పాటు జలుబు, నిరంతర తీవ్రమైన దగ్గు, గొంతు నొప్పి వంటి లక్షణాలు ఉంటే మాత్రం అది కచ్చితంగా కరోనా అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

దీనికి మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కొవిడ్ టెస్టు చేయించుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. కొన్నిసార్లు వ్యక్తికి కరోనా లక్షణాలు అన్ని ఉంటాయి.. కానీ వారిలో ఆరోగ్యపరంగా పెద్దగా సమస్య కనిపించదు. బాగానే ఉన్నాలే అనుకుని కొవిడ్ టెస్టు చేయించుకోరు.. ఇలా ఎప్పుడూ చేయొద్దు.. ఆ వ్యక్తిలో లక్షణాల తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ.. తక్కువ రోగనిరోధక శక్తి కలిగిన లేదా వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తితో కలిస్తే.. ఆ ఆ వ్యక్తికి కరోనా సోకే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఆ వ్యక్తి నుంచి సోకిన మరో వ్యక్తికి ప్రాణాంతకం అయ్యే ప్రమాదం ఎక్కవుగా ఉండొచ్చు..

ఫ్లూ.. కరోనా దగ్గుకు తేడా ఏంటంటే? :
ఫ్లూ వచ్చినా వారిలో దగ్గుతో పాటు చలివణుకుడు, తలనొప్పి, ముక్కు దిబ్బెడ వంటి లక్షణాలు ఉంటాయి. కరోనా సోకినవారిలో నిరంతర దగ్గుతో పాటు తీవ్రమైన ఛాతీ నొప్పి ఉంటుంది. కొంతమందిలో ఉబ్బసం, బ్రోన్కైటిస్, COPD వ్యాధి ఉన్నవారిలో కరోనా దగ్గు తీవ్రంగా ఉంటుంది. అప్పుడు శ్వాస తీసుకోవడమే కష్టంగా మారుతుంది. శ్వాసలో ఇబ్బంది కలగడం కరోనా ఇన్ఫెక్షన్ ప్రధాన లక్షణంగా గుర్తించాలి. అలాంటి పరిస్థితిలో ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన ట్రీట్ మెంట్ తీసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.

ఒమిక్రాన్.. ఈ లక్షణం కామన్..
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటివరకూ 90 మందికి పైగా ఒమిక్రాన్ బారినపడ్డారు. అయితే ఆస్పత్రుల్లో చేరిన రోగులు త్వరగా కోలుకుంటున్నారు. సోకిన వారిలో చాలా మందిలో అలసట సమస్య అధికంగా కనిపిస్తోంది. ఈ లక్షణం దాదాపు అన్ని రోగులలో కామన్ సింప్టమ్‌గా కనిపిస్తోంది. ఎక్కువమందిలో అసలు ఈ లక్షణాలే కనిపించడం లేదు. వారిలో ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. ఆస్పత్రి నుంచి 90 శాతం ఒమిక్రాన్ బాధితులు కోలుకుంటున్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. బయటకు వెళ్లినప్పుడు ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి.. భౌతిక దూరాన్ని పాటించాలి.. తరచూ చేతులు కడుక్కోవాలి.. అవసరమైనచోట శానిటైజర్ వినియోగం తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిది..

అసలు కరోనా లక్షణాలు ఇవే..
– గొంతులో మంట, నొప్పి
– నిరంతర తీవ్రమైన దగ్గు
– రుచి లేదా వాసన కోల్పోవడం
– శ్వాస తీసుకోలేకపోవడం
– నిరంతర అలసట
– వాంతులు అతిసారం
– అధిక జ్వరం.. వస్తూ పోవడం..

Read Also : Third Wave : కరోనా ముూడో దెబ్బ! నెలాఖరు నాటికి రోజుకు 8 లక్షల కేసులు రావొచ్చు..!