వేల సంఖ్యలో కోలుకుంటున్న పేషెంట్లు.. కరోనాను ఎదురించడంలో ఇండియా ముందంజ

వేల సంఖ్యలో కోలుకుంటున్న పేషెంట్లు.. కరోనాను ఎదురించడంలో ఇండియా ముందంజ

ఇండియాలో కరోనా వైరస్ కేసులు 15వేల 712కు చేరాయి. ఆదివారం నాటికి 505 మంది మృత్యువాత పడ్డారు. ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2వేల 230 కేసులు ప్రాణాంతక వ్యాధి నుంచి రికవరీ అయినట్లు సమాచారం. వైరస్ ను అడ్డుకోవడానికి దేశంలోని పలు రాష్ట్రాలు చర్యలను వేగవంతం చేశాయి. కేంద్రం ప్రకటించినట్లు లాక్‌డౌన్‌లో సడలింపులు చేసేందుకు నో చెప్పాయి. 

తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఢిల్లీ గవర్నమెంట్ లాక్‌డౌన్‌లో ఎటువంటి రిలాక్సేషన్ లేదని తేల్చాయి. ఏప్రిల్ 27న రివ్యూ మీటింగ్ అయితేనే నిర్ణయం చెబుతామని ఢిల్లీ అంటుంటే తెలంగాణ గవర్నమెంట్ ఏప్రిల్ 30వరకూ లాక్‌డౌన్ విరమించేదే లేదని ముందుగానే ఖరారు చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వం సైతం సోమవారం నుంచి కొద్ది పాటి ఆర్థిక వ్యవహారాలకు మాత్రమే అనుమతులు ఇచ్చింది. 

ఇతర దేశాలతో పోలిస్తే భారత్ త్వరగా కోలుకుంటుందని ప్రధాని మోడీ గతంలోనే చెప్పారు. పోల్చుకోకూడదంటూనే ప్రజలంతా ఏకమై లాక్ డౌన్ కు సహకరించడంతో మహమ్మారిని ఎదుర్కోగలుగుతున్నామన్నారు. 

ప్రపంచవ్యాప్తంగా కరనా మృతుల సంఖ్య లక్షా 60వేల 784కు చేరింది. 193దేశాల్లో 23లక్షల 32వేల 456కేసులు నమోదైనట్లు సమాచారం. డిసెంబరు నెల చైనాలోని వూహాన్ కేంద్రంగా పుట్టిన వైరస్ ను అడ్డుకోవడానికి ప్రపంచ నలు మూలల నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వ్యాక్సిన్ తయారుచేయడంలో ప్రభుత్వం హై లెవల్ టాస్క్ ఫోర్స్ ను సిద్ధం చేసింది. ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ తయారుచేయగా మూడు చోట్ల మాత్రం మానవ శరీరాలపై ప్రయోగదశలో ఉన్నాయి. 

Also Read | నిండు గర్బిణీ..7 కిలో మీటర్లు..డెలివరీ చేసిన డెంటల్ హాస్పిటల్ వైద్యులు