గత 24గంటల్లో దేశంలో 9,983కరోనా కేసులు

  • Edited By: vamsi , June 8, 2020 / 05:50 AM IST
గత 24గంటల్లో దేశంలో 9,983కరోనా కేసులు

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. వైరస్‌ వ్యాప్తిని తగ్గించేందుకు ప్రభుత్వం, పౌరులు ఎన్ని భద్రతా చర్యలు చేపట్టినా కూడా కరోనా కేసులు పెద్దగా తగ్గుముఖం పట్టట్లేదు. గత 24 గంటల్లో దేశంలో 9,983 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఈ కాలంలో కరోనా వైరస్ కారణంగా 206 మంది చనిపోయారు.

దేశంలో కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్ల సంఖ్య 2.5 లక్షలకు పైగా పెరిగిపోయింది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా సమాచారం ప్రకారం, దేశంలో ఇప్పటివరకు మొత్తం 2,56,611 కేసులు నమోదయ్యాయి, కరోనా నుంచి మరణించిన వారి సంఖ్య కూడా 7,135కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 1,25,381 క్రియాశీల కేసులు ఉండగా, 1,24,095 మంది రోగుకు నయమైంది.

ఇక ఈ రోజు నుండి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో మాల్స్, హోటల్-రెస్టారెంట్లు మరియు మతపరమైన ప్రదేశాలు ఓపెన్ అవుతున్నాయి. అనేక షరతులతో వాటిని నేటి నుంచి తెరవడానికి ప్రభుత్వం అనుమతించింది. జూన్‌ 7వ తేదీ నాటికి దేశంలో 47,74,434 కరోనా టెస్టుల నిర్వహించారు. ఈమేరకు కేంద్రవైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.