Coronavirus: దేశవ్యాప్తంగా తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన ఒమిక్రాన్ కేసులు

దేశంలో ఘోరమైన కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 8వేల 306 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.

Coronavirus: దేశవ్యాప్తంగా తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన ఒమిక్రాన్ కేసులు

Corona

Coronavirus Cases Today: దేశంలో ఘోరమైన కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 8వేల 306 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 211మంది మరణించారు. ఇప్పటివరకు, దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ కేసులు 21 నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో దేశవ్యాప్తంగా 4 లక్షల 73 వేల 537 మంది మరణించారు.

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 98 వేల 416. అదే సమయంలో, ఈ మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4 లక్షల 73 వేల 537కు పెరిగింది. ఇదే సమయంలో గడిచిన 24గంటల్లో 8వేల 834మంది కోలుకున్నారు. ఇప్పటివరకు 3 కోట్ల 40 లక్షల 69 వేల 608 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

Salaar: క్రేజీ టాక్.. భారీ స్థాయిలో ఇంటర్వెల్ సీక్వెన్స్ రీషూట్?

ఇప్పటివరకు 127 కోట్ల డోస్‌లు:
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ విస్తృతంగా సాగుతోంది. ఇప్పటివరకు 127 కోట్లకు పైగా యాంటీ-కరోనావైరస్ వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి. నిన్న 24 లక్షల 55 వేల 911 డోసులు ఇవ్వగా, ఇప్పటి వరకు మొత్తం 127 కోట్ల 93 లక్షల 9 వేల 669 డోసుల వ్యాక్సిన్‌లు అందించారు.

Virat Kohli: వన్డే కెప్టెన్‌గా కోహ్లీని పక్కకుబెట్టి రోహిత్‌ను తీసుకోవాలని బీసీసీఐ ప్లాన్!!

దేశంలో 21 మందికి ఓమిక్రాన్:
కొత్తగా కంగారు పెట్టేస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లో 21మందికి సోకింది. గడిచిన 24గంటల్లో 17మందికి ఓమిక్రాన్ సోకిందని, ఆ తర్వాత మొత్తం సంఖ్య 21కి పెరిగిందని వెల్లడించారు ఆరోగ్య అధికారులు. ఆదివారం నమోదైన 17 కేసుల్లో రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో 9, మహారాష్ట్రలోని పూణేలో 7, ఢిల్లీలో ఒకటి నమోదయ్యాయి.