India’s Corona Update: రెండు నెలల తర్వాత తగ్గిన కరోనా కేసులు.. మరణాలు కూడా!

దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ తగ్గుముఖం పడుతోంది. ప్రపంచంలో కరోనా కారణంగా ప్రతి మూడవ మరణం భారతదేశంలో జరుగుతోండగా.. క్రియాశీల కేసుల విషయంలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్న భారత్‌లో కరోనా కేసులు తగ్గాయి.

India’s Corona Update: రెండు నెలల తర్వాత తగ్గిన కరోనా కేసులు.. మరణాలు కూడా!

Coronavirus Update India Reports 1 14 Lakh New Covid 19 Cases Lowest Since April 6

Coronavirus Cases in India Today 6 June: దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ తగ్గుముఖం పడుతోంది. ప్రపంచంలో కరోనా కారణంగా ప్రతి మూడవ మరణం భారతదేశంలో జరుగుతోండగా.. క్రియాశీల కేసుల విషయంలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్న భారత్‌లో కరోనా కేసులు తగ్గాయి. ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో కరోనా సోకిన రెండవ దేశం భారతదేశం కాగా.. గడిచిన 24గంటల్లో దేశంలో లక్షా 14 వేల 460 కొత్త కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో 2వేల 677మంది కోవిడ్ కారణంగా చనిపోయారు.

దేశంలో కరోనా మహమ్మారి గ్రాఫ్ నిరంతరం పడిపోతున్నప్పటికీ కోవిడ్ నుంచి మరణించిన వారి సంఖ్య తగ్గుతూ పెరుగుతూ ఉంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో లక్షా 89 వేల 232 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో 77,449 క్రియాశీల కేసులు తగ్గాయి. రెండు నెలల తర్వాత దేశంలో ఇంత తక్కువ కేసులు నమోదనైట్లుగా నివేదికలు చెబుతున్నాయి.

వరుసగా 24వ రోజు, దేశంలో కొత్త కరోనా వైరస్ కేసుల కంటే రికవరీలు ఎక్కువగా ఉన్నాయి. జూన్ 5వ తేదీ వరకు దేశవ్యాప్తంగా 23కోట్ల 13 లక్షల 22వేల మోతాదుల కరోనా వ్యాక్సిన్ ఇవ్వబడింది. చివరి రోజు 33 లక్షల 53 వేల 539మందికి టీకాలు ఇచ్చారు. అదే సమయంలో ఇప్పటివరకు 36 కోట్ల 47 లక్షల మందికి కరోనా పరీక్షలు చేశారు. పాజిటివిటీ రేటు 6 శాతంగా ఉంది.

దేశంలో కరోనా పరిస్థితి:
కరోనా కేసులు – రెండు కోట్ల 88 లక్షలు 9 వేల 33మంది
కోలుకున్నవారు- రెండు కోట్లు 69 లక్షలు 84 వేల 781మంది
క్రియాశీల కేసులు – 14లక్షల 77 వేల 799మంది
చనిపోయినవారు- 3 లక్షల 46 వేల 759మంది

దేశంలో కరోనా మరణాల రేటు 1.20 శాతం కాగా, రికవరీ రేటు 93 శాతానికి మించిపోయింది. యాక్టివ్ కేసులు 6 శాతం కన్నా తక్కువగా ఉన్నాయి. కరోనా యాక్టివ్ కేసుల విషయంలో భారతదేశం ప్రపంచంలో రెండవ స్థానంలో ఉంది. మొత్తం సోకిన వారి సంఖ్య ప్రకారం భారతదేశం రెండవ స్థానంలో ఉంది.