కరోనా సాయం: కార్మికులకు రోజుకు వెయ్యి రూపాయలు.. నెలకు సరిపడా రేషన్

కరోనా సాయం: కార్మికులకు రోజుకు  వెయ్యి రూపాయలు.. నెలకు సరిపడా రేషన్

బాలీవుడ్ సింగర్‌తో పాటు 23మంది కరోనా కేసులు నమోదవడంతో యూపీ సీఎం ఆదిత్యనాథ్ కరోనాపై దృష్టి పెట్టారు. 15 లక్షల మంది రోజు వారీ కార్మికులకు, 20.23లక్షల మందికి భవన నిర్మాణ కార్మికులకు సాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. వారికి రోజువారీ అత్యవసరాలు తీరుస్తూ.. రోజు ఖర్చులకు వెయ్యి రూపాయలు అందజేయనున్నారు. 

కరోనా పేషెంట్లకు వైద్య సహాయం అందించగల ఐసోలేషన్ వార్డులు యూపీలో ఉన్నాయని నమ్మకాన్ని వ్యక్త పరిచారు సీఎం. కరోనా గురించి భయపడొద్దంటూ ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. ‘నేను ప్రజలను ఒక్కటే కోరుకుంటున్నాను. దాని గురించి భయపడకండి. మందులు, కావాలసిన ముడి పదార్థాలు అందుబాటులోనే ఉన్నాయి. కొద్దిరోజుల్లో దొరకవేమో అనే అనుమానంతో షాపింగ్ మాల్స్‌కు పరుగులు పెట్టొద్దు.

ప్రజలు గుమిగూడి ఉన్న చోట కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందంటూ యూపీ ప్రభుత్వం సూచనలు ఇస్తుంది. ప్రధాని మోడీ పిలుపుమేరకు ఆదివారం జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని యూపీ ప్రజలకు సీఎం సూచనలు ఇచ్చారు. ప్రధాని పిలుపుమేరకు ప్రజలంతా కదిలిరావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మెట్రో రైల్, రాష్ట్ర, సిటీ బస్ సర్వీసులు ఆదివారమంతా కలోజ్ అయి ఉంటాయని సీఎం వెల్లడించారు.

లక్నో పోలీసులు రాష్ట్ర రాజధానిలో కరోనా రాకుండా చూడాలని 14టీంలు పది మంది సభ్యులుచొప్పున  ఏర్పడి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

See Also | వేడి నీటిలో నిమ్మరసం పసుపు కలిపి తాగడం, మామిడిపండు తినడం వల్ల కరోనా తగ్గదు.. WHO