ఏప్రిల్ లో నో హాలీడే : కరోనా కేసులు పెరగడంతో కేంద్రం కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

ఏప్రిల్ లో నో హాలీడే : కరోనా కేసులు పెరగడంతో కేంద్రం కీలక నిర్ణయం

Coronavirus Vaccination Drive To Be Carried Out Throughout April Including Holidays Centre

Coronavirus దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెలలో సెలవు దినాలతో పాటు అన్ని రోజులూ ప్రభుత్వ, ప్రైవేటు వ్యాక్సిన్‌ కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని కేంద్రప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను విస్తరించడంలో భాగంగా అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిట ప్రాంతాలు ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతో పాటు ఈ డ్రైవ్‌లో ఎక్కువ మందికి టీకా వేసేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఓవైపు కేసులు పెరుగుతుండటం, మరోవైపు వ్యాక్సిన్లు మిగిలిపోయి వృధా అయిపోతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ నిర్వహణపై జాతీయ నిపుణుల కమిటీ సిఫారసు ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

ఇక, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45 ఏళ్లకు పైబడిన వాళ్లందరికీ వ్యాక్సిన్లు వేస్తున్నారు. భారీగా కేసులు నమోదవుతున్న చోట్ల 45 ఏళ్ల కంటే తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని వర్గాలకు వ్యాక్సిన్లు వేసేందుకు కేంద్రం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. తొలుత హెల్త్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్లు వేసిన ప్రభుత్వం… ఆ తర్వాత 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు అవకాశం ఇచ్చింది. ఏప్రిల్-1,2021 నుంచి 45 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ వేస్తున్నారు.