COVAXIN : కోవాగ్జిన్ ప్రయోగాలు సత్ఫలితాలు – భారత్ బయోటెక్

  • Published By: madhu ,Published On : September 12, 2020 / 06:45 AM IST
COVAXIN : కోవాగ్జిన్ ప్రయోగాలు సత్ఫలితాలు – భారత్ బయోటెక్

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్‌ కొనుగొనే ప్రయోగాల్లో భారత్‌ బయోటెక్‌ మరో ముందడుగు వేసినట్లు తెలిపింది. జంతువులపై కొవాగ్జిన్‌ ప్రయోగాలు సత్ఫలితాలు ఇచ్చాయని వెల్లడించింది. వ్యాక్సిన్‌ ఇచ్చిన జంతువుల్లో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్‌ బయోటెక్‌ ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.



https://10tv.in/apple-has-designed-its-own-face-masks-for-employees/
కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌తో జంతువుల్లో ఎలాంటి ప్రతికూల ప్రభావం కలగలేదని భారత్‌ బయోటెక్‌ ప్రకటించింది. జంతువులకు రెండో డోస్‌ ఇచ్చిన 14 రోజుల తర్వాత పరిశీలించామని తెలిపింది. ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో వైరస్‌ వృద్ధిని నియంత్రించినట్లు గుర్తించామని వెల్లడించింది. వ్యాక్సిన్‌ ఇచ్చిన జంతువుల్లో వ్యాధి నియంత్రణ అద్భుతంగా ఉందని తెలిపింది.



భారత్‌ బయోటెక్‌ సంస్థ కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఇటీవలే రెండో దశ ట్రయల్స్‌ను ప్రారంభించింది. తెలంగాణలో నిమ్స్‌లోనూ రెండో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ షురూ అయ్యాయి. ఈ దశలోనూ సత్ఫలితాలు వస్తే.. మరికొద్ది రోజుల్లోనే మూడోదశ ట్రయల్స్‌కు వెళ్లే అవకాశముంది.