Wimbledon 2020పై కరోనా దెబ్బ..వీరి ఆటను చూడలేమా!

  • Published By: madhu ,Published On : April 2, 2020 / 02:50 AM IST
Wimbledon 2020పై కరోనా దెబ్బ..వీరి ఆటను చూడలేమా!

కరోనా రాకాసి కుమ్మేస్తోంది. ఎన్నో రంగాలను కుదిపేస్తోంది. దీని కారణంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయింది. జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడే రవాణా నిలిచిపోయింది. దీనికారణంగా పలు కార్యక్రమాలు రద్దయ్యాయి. పలు రంగాలపై ఎఫెక్ట్ చూపెట్టింది. క్రీడా రంగంపై కూడా ప్రభావం చూపింది. వింబుల్డన్ మ్యాచ్ లు రద్దయ్యింది.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత వింబుల్డన్ రద్దు కావడం ఇదే తొలిసారి అని చెప్పవచ్చు. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ మ్యాచ్ లు 2020, జూన్ 29వ తేదీ నుంచి జులై 12 వరకు జరగాల్సి ఉంది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న క్రమంలో టోర్నీని వాయిదా వేయాలని తొలుత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో 2020, ఏప్రిల్ 01వ తేదీ బుధవారం అత్యవసర సమావేశం జరిగింది. ఇందులో వింబుల్డన్ రద్దు చేయాలని ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ నిర్ణయం తీసుకుంది. 

2021, టోర్నీ జూన్ 28వ తేదీన ప్రారంభం కానుందని తెలుస్తోంది. దిగ్గజ క్రీడాకారులు రోజర్ ఫెదరర్, వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్ ఆడకపోవచ్చని సమాచారం. ఎందుకంటే..వచ్చే ఏడాది (2021) ఫెదరర్, సెరెనా ఏజ్ 40 ఏళ్లకు చేరవవుతారు. వీనస్ వయస్సు 41 ఏళ్లకు చేరుతుంది. దీంతో వీరు ఆడుతారా ? లేదా ? అనేది చూడాలి. 

* వింబుల్డన్ ను తొలిసారి 1877లో నిర్వహించారు. 
* మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా 1915 – 1918 జరగలేదు. 
* రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1940 నుంచి 1945 వరకు కూడా మ్యాచ్ లు  జరగలేదు. 
 

* ఈ రెండూ తప్ప..మిగతా రోజుల్లో వింబుల్డన్ నిరంతరాయంగా సాగింది. 
* ఇప్పటికే కరోనా కారణంగా ఫ్రెంచ్ ఓపెన్ ను మే నుంచి సెప్టెంబర్ వరకు వాయిదా వేశారు. 
* యూఎస్ ఓపెన్ (ఆగస్టు 31) షెడ్యూల్ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

Also Read | కరోనా ఎఫెక్ట్ : తెలంగాణాలో వారికి మాత్రమే పూర్తి జీతం