కరోనా నేర్పిన కొత్త పాఠం : వలస కార్మికుల కొత్త నిర్ణయాలతో భారత ఎకానమీకి పెద్ద దెబ్బ

  • Published By: venkaiahnaidu ,Published On : April 4, 2020 / 02:20 PM IST
కరోనా నేర్పిన కొత్త పాఠం : వలస కార్మికుల కొత్త నిర్ణయాలతో భారత ఎకానమీకి పెద్ద దెబ్బ

దేశంలో కరోనా వైరస్(కోవిడ్-19)వ్యాప్తిని నిరోధించడంలో భాగంగా ప్రధానమంత్రి అకస్మాత్తుగా ప్రకటించిన 21రోజుల లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అనేకమంది వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పనిచేస్తున్న చోట నుంచి యజమానులు తరిమేయడం,సొంత ఊర్లకు వెళ్లేందుకు రవాణా సౌకర్యాలు లేకపోవడం, చేతిలో డబ్బులు లేక ఖాళీ కడుపులతో వందల కిలోమీటర్లు కాలినడక ద్వారా సొంతూర్లకు వెళ్లే ప్రయత్నాలు.. ఇలా వలస కార్మికులు ఆకస్మిక లాక్ డౌన్ తో చాలా ఇబ్బందులకు గురయ్యారు. దాదాపు అన్ని రాష్ట్రాలు….ఇప్పుడు వలస కార్మికుల కోసం వసతిగృహాలను ఏర్పాటు చేసి వారికి ఫుడ్ ను అందిస్తున్నారు.

అయితే వలస కార్మికుల యొక్క ఆకస్మిక స్థాన మార్పు…భారత ఎకానమీపై చాలా దూరం ప్రభావం చూపించనుంది. లాక్ డౌన్ కారణంగా బలవంతగా… వలస కార్మికులు ఎదుర్కొంటున్న వ్యవహార మార్పుల పరిణామాలను డీల్ చేసేందుకు అన్ని రాష్ట్రాలు సిద్ధంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్…డిస్టెస్స్ మాటర్స్(సామాజిక దూరం వ్యవహారాలు)గురించి కార్మికులకు బోధించిందని తిరువనంతపురంలోని సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ స్టడీస్ లో ఫ్రొఫెసర్ గా ఉన్న యస్ ఇరుదయ రాజన్ తెలిపారు. పాపులేషన్ స్టడీస్ లో భారతదేశంలోనే ఆదిమ నిపుణుల్లో రాజన్ ఒకరు. వార్షిక కేరళ మైగ్రేషన్(వలస)సర్వేలో రాజన్ ముందుంటారు.

2008నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం పాఠం ఉద్యోగ విషయాలకు సంబంధించినదిగా ఉండిందని రాజన్ అన్నారు. అయితే ఇప్పుడు కరోనా వైరస్ డిస్టెన్స్(దూరం)లో కొత్త పాఠం ఇచ్చిందని,దీనివల్ల లాంగ్ డిస్టెన్స్ మైగ్రేషన్(దూర ప్రాంతాలకు వలస పనుల కోసం వలస వెళ్లడం)లో గణనీయమైన తగ్గుదలకు దారితీస్తుందని తెలిపారు. చాలామంది వలస కార్మికులు దూరప్రాంతాలకు వెళ్లేందుకు ఇకపై ఎక్కువ ఆశక్తి చూపించరని రాజన్ చెబుతున్నారు. పెద్ద నగరాల నుండి వెళ్లిపోయిన అనేక మంది వలస కార్మికులు ఎప్పటికీ తిరిగి రాకపోవచ్చు, వారి ఉపాంత పొలాలలో జీవనం గడపడానికి లేదా సమీప పట్టణాల్లో పని చేయడానికి ఇష్టపడతారని ఆయన తెలిపారు. గురుగ్రామ్, సూరత్ మరియు తిరుప్పూర్ వంటి ఇండస్ట్రియల్ సెక్టార్(పారిశ్రామిక కేంద్రాలు)సుదీర్ఘకాలం వలస కార్మికులను కోల్పోతుందని, మరియు మాంద్యం నుండి కోలుకోవడానికి కష్టపడే చిన్న మరియు మధ్య తరహా యూనిట్లపై వేతన భారాన్ని పెంచుతుందని రాజన్ తెలిపారు.

2016-17ఆర్థిక సర్వే ప్రకారం..దేశంలో దాదాపు 90లక్షల మంది కార్మికులు ఉన్నారని అంచనా. అంటే ఈ 90లక్షల మంది తమ సొంత రాష్ట్రం లేదా ప్రాంతాలను విడిచి దేశంలోనే వేరే ప్రాంతాలు లేదా రాష్ట్రాలకు కూలి పనులు,ఉద్యోగాల కోసం వలస వెళ్తున్నారన్నమాట. వలస కార్మికులకు టాప్ డెస్టినేషన్ గా ఢిల్లీ,ముంబై సిటీలు ఉన్నాయి. దేశరాజధానికి,దేశ ఆర్థికరాజధానికి ఏటా లక్షలమంది కూలీ పనుల కోసం,కొత్త ఉద్యోగాల కోసం వలస వెళ్తుంటారన్న విషయం తెలిసిందే. కొన్నేళ్లుగా దక్షిణాది రాష్ట్రాలకు కూడా వలస కార్మికులు వస్తున్నారు. ముఖ్యంగా అసోం,ఉత్తరప్రదేశ్,బీహార్,బెంగాల్ రాష్ట్రాలకు చెందినవారు పనుల కోసం, ఉద్యోగాల కోసం వెళ్తుంటారు.

అయితే దేశంలో లాక్ డౌన్ ఎత్తివేయబడిన తర్వాత వలస కార్మికుల ఇంటికి వచ్చే రెండవ తరంగం ఉండవచ్చు. ఇప్పటివరకు రవాణా సౌకర్యం లేని కారణంగా ఆయా రాష్ట్రాల్లోని షెలర్ట్ హోమ్ లలో ఉంటున్నవాళ్లు లాక్ డౌన్ తర్వాత తిరిగి తమ ఇంటికి వెళ్లాలని తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే వారు మొదటి అవకాశంతో ఇళ్లకు బయలుదేరుతారుని రాజన్ చెప్పారు. అంతకుముందు పనిప్రదేశాలను విడిచిపెట్టిన వారు తిరిగి రావాలని నిర్ణయించుకున్నా…కంపెనీలు లేబర్ ను తగ్గించుకునే ప్రయత్నాలు చేయవచ్చు. ఈ అంతరాయం పొలాల వరకు విస్తరించవచ్చు, ఇది వర్షంతో మొదలయ్యే ఖరీఫ్ సీజన్ తో మొదలవుతుందని రాజన్ చెప్పారు.