Covid Vaccine Cost: కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రపంచంలోనే ఎక్కువ ధరకు అమ్ముకుంటున్న ఇండియన్ ప్రైవేట్ హాస్పిటళ్లు

ఇండియాలోని ప్రైవేట్ సెక్టార్ హాస్పిటల్స్ వ్యాక్సిన్ కోసం ఒక్క డోసుకు రూ.700 నుంచి రూ.1500వరకూ వసూలు చేస్తున్నాయి. అది కూడా 18 నుంచి 44ఏళ్ల గ్రూపు వారు CoWINవెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకున్న వివరాలు..

Covid Vaccine Cost: కొవిడ్ వ్యాక్సిన్‌ను ప్రపంచంలోనే ఎక్కువ ధరకు అమ్ముకుంటున్న ఇండియన్ ప్రైవేట్ హాస్పిటళ్లు

Covid Vaccine

Covid Vaccine Cost: ఇండియాలోని ప్రైవేట్ సెక్టార్ హాస్పిటల్స్ వ్యాక్సిన్ కోసం ఒక్క డోసుకు రూ.700 నుంచి రూ.1500వరకూ వసూలు చేస్తున్నాయి. అది కూడా 18 నుంచి 44ఏళ్ల గ్రూపు వారు CoWINవెబ్ సైట్ లో రిజిష్టర్ చేసుకున్న దానిని బట్టి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.

ఇది దాదాపు మిగతా దేశాల ప్రైవేట్ హాస్పిటల్స్ కంటే ఆరు రెట్లు ఎక్కువ. వారంతా 45ఏళ్లు పైబడిన వారందరికీ రూ.250కే వ్యాక్సిన్ విక్రయిస్తున్నారు. సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కొవీషీల్డ్ రూ.700 నుంచి రూ.900మధ్యలో అమ్ముడుపోతుంది.

అదే భారత్ బయోటెక్ తయారుచేసిన కొవాగ్జిన్ రూ.1250 నుంచి రూ.1500వరకూ పలుకుతోంది. కొవిన్ వెబ్ సైట్ ప్రకారం.. ప్రైవేట్ సెక్టార్ వ్యాక్సినేషన్ ప్రక్రియ అపోలో, మ్యాక్స్, ఫోర్టీస్, మణిపాల్ హాస్పిటల్స్ లో జరుగుతుంది. ప్రపంచ దేశాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువ. కొవీషీల్డ్ కు 12డాలర్లు వస్తుంటే, కొవాగ్జిన్ 17డాలర్ల వరకూ వసూలు చేస్తున్నారు.