Election Results 2022: నేడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మరికొద్ది గంటల్లో ఆయా రాష్ట్రాల్లో ఏఏ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయోనన్న దానిపై స్పష్టత రానుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది.

Election Results 2022: నేడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

Election Counting

Election Results 2022: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. మరికొద్ది గంటల్లో ఆయా రాష్ట్రాల్లో ఏఏ పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయోనన్న దానిపై స్పష్టత రానుంది. రెండు రాష్ట్రాలకు సంబంధించి ఉదయం 8గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 12న ఒకే దశలో ఎన్నికలు జరగగా, గుజరాత్ రాష్ట్రంలో డిసెంబర్ 1, 5 తేదీల్లో రెండు విడతలుగా ఎన్నికలు జరిగాయి.

Gujarat Polls: గుజరాత్ ఎన్నికల్లో ఓటింగ్ తగ్గుదలకు అదే అసలు కారణమట

గుజరాత్‌లో నేడు కౌంటింగ్..

గుజరాత్ రాష్ట్రంలో మరికొద్ది సేపట్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రంలోని కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మొత్తం 37 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది. ఉదయం 8గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 92 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ఉండాలి. ఇదిలాఉంటే 2017 కంటే ఈసారి ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది. 2017లో 68.39 శాతం ఓటింగ్ ఉండగా, ఈసారి 64.33 శాతం మాత్రమే ఓటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇషుదన్ గాధ్వి, హార్దిక్ పటేల్, జిగ్నేష్ మేవానీ సహా మొత్తం 1,621 మంది అభ్యర్థుల భవితవ్యం మరికొద్దిసేపట్లో తేలనుంది.

Gujarat Polls: మోదీ నిర్వహించిన అతి పెద్ద రోడ్‭-షోలో ఎన్ని లక్షల మంది పాల్గొన్నారో తెలుసా?

గుజరాత్ లో గత 27 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం కొనసాగుతోంది. రాష్ట్రంలో వరుసగా ఏడోసారి అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. అయితే, ఎగ్జిట్ పోల్ అంచనాలు మాత్రం గుజరాత్ రాష్ట్రంలో బీజేపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు.

Himachal Pradesh Polls: ప్రపంచంలోనే ఎత్తైన పోలింగ్ బూత్‭లో 100% నమోదైన పోలింగ్

హిమాచల్ ప్రదేశ్‌లో..

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మరికొద్దిసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో 59 చోట్ల ఏర్పాటు చేసిన 68 కౌంటింగ్ కేంద్రాల్లో ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్ 12న పోలింగ్ జరిగింది. 76.44శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం కొనసాగుతుంది. అయితే. ఈ రాష్ట్రంలో ప్రతీ ఐదేళ్లకొక సారి ప్రభుత్వం మారుతుంది. ఈ సారి మరి బీజేపీ ప్రభుత్వమే మళ్లీ అధికారంలోకి వస్తుందా.. ఆనవాయితీ ప్రకారం వేరే పార్టీలు అధికారంలోకి వస్తాయా అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఈ రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం.. బీజేపీనే మరోసారి అధికారంలోకి వస్తుంది. కానీ, కాంగ్రెస్ పార్టీసైతం గట్టి పోటీని ఇస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా.