చౌకీదార్ గా ఉంటా….ప్రభుత్వ ధనాన్ని కాపాడతా

  • Published By: venkaiahnaidu ,Published On : March 31, 2019 / 02:44 PM IST
చౌకీదార్ గా ఉంటా….ప్రభుత్వ ధనాన్ని కాపాడతా

భారతీయులకు రాజులు అవసరం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు.కాపాలదారులంటేనే దేశ ప్రజలకు ఇష్టమని అన్నారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం(మార్చి-31,2019)ఢిల్లీలోని తల్కతోర ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ ప్రచార కార్యక్రమం ‘మైన్ భీ చౌకీదార్’లో మోడీ మాట్లాడుతూ…2014లో నేను భారతదేశానికి కొత్తవాడిని. ఓ ముఖ్యమంత్రిగానే భారతీయులకు నేను పరిచయం.ఆ సమయంలో నా విమర్శకులే నా గురించి ప్రచారం చేశారు. వారి వల్లే ప్రజలకు నా గురించి తెలిసింది. అందువల్ల వారికి ధన్యవాదాలు చెప్తున్నాను అని మోడీ తెలిపారు. ప్రజలు తన గురించి ఆసక్తిగా గమనించడానికి కారణం విమర్శకులేని అన్నారు.బీజేపీ తనకు ఓ బాధ్యత అప్పగించిందని, కాపలాదారుగా చేసిందని తెలిపారు.

అవినీతిపరుల నుంచి దేశ సంపదను కాపాడటానికి గట్టి కృషి చేస్తానన్నారు.కాపలాదారు అంటే ఏదో ఓ యూనిఫాం, టోపీ ధరించి, ఈల పట్టుకోవడం అని కొందరు అనుకుంటారన్నారని, అలాంటివారి ఆలోచనా సామర్థ్యం చాలా తక్కువ అని మోడీ తెలిపారు. ఈ ఐదేళ్ళలో దేశ ప్రజలంతా తనకు మద్దతిచ్చారన్నారు. నేడు ఇక్కడ ప్రతి ఒక్కరూ కాపలాదారేనన్నారు. ఈసారి ప్రతి కాపలాదారు బరిలో ఉన్నారని చెప్పారు. కాపలా ఉండటం ఆదర్శప్రాయమైనదని, అదొక గొప్ప అనుభూతి అని తెలిపారు. ప్రభుత్వ ధనాన్ని దోపిడీకి గురికానివ్వబోనని,కాపలాదారుగా తాను తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానన్నారు. కొందరు తమ పరిమిత ఆలోచనా సామర్థ్యం వల్ల ‘కాపలాదారు’కు ఉన్న డిక్షనరీలోని అర్థానికి మించి ఆలోచించలేరని అన్నారు.