ఎన్నికల్లో..మద్యం, మనీల వరద: రూ.528.98 కోట్లు సీజ్ 

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగనున్న వేళ  కట్టల కొద్దీ నగదు పట్టుబడుతోంది.

  • Published By: veegamteam ,Published On : April 10, 2019 / 04:20 AM IST
ఎన్నికల్లో..మద్యం, మనీల వరద: రూ.528.98 కోట్లు సీజ్ 

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగనున్న వేళ  కట్టల కొద్దీ నగదు పట్టుబడుతోంది.

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరుగనున్న వేళ  కట్టల కొద్దీ నగదు పట్టుబడుతోంది. ఓటర్లను ప్రలోభాల పర్వానికి నేతలు తెరతీసే క్రమంలో వాహనాలలో తరలించేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఊరుకుంటారా? ఆదే అదనుగా తనిఖీలను మమ్మరం చేసి పట్టుబడిన భారీ నగదును స్వాధీనం చేసుకుంటున్నారు. 

దేశవ్యాప్తంగా విస్తృతంగా జరుగుతున్న తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.528.98 కోట్లు సీజ్ చేశారు. అలాగే రూ.186.19 కోట్ల విలువైన మద్యం, రూ.33.38 కోట్ల విలువైన బంగారం, రూ.725.35 కోట్ల విలువైన డ్రగ్స్, స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు ఓట్లరు ప్రలోభ పెట్టేందుకు పలు వస్తువులను కూడా నేతలు పంపిణీ చేస్తున్న క్రమంలో 162.93 కోట్ల విలువైన ఖరీదైన వస్తువులు, 12 కోట్ల విలువ చేసే గిఫ్ట్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
Read Also : ఎన్నికల ఏర్పాట్లలో ఈసీ అధికారులు

ఇక పోతే తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం పర్వం ముగియడంతో పోలింగ్‌కు కౌంట్ డౌన్ మొదలయింది. ఏప్రిల్ 11న పోలింగ్ జరనున్న నేపథ్యంలో ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు అధికారులు. పోలింగ్ సామాగ్రి, సిబ్బందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్‌కు ముందు ఓటర్లను మద్యం, డబ్బులతో ప్రలోభపెట్టే అవకాశం ఉండడంతో అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలుచేస్తామని ఏపీ ఎన్నికల ముఖ్య అధికారి ద్వివేది స్పష్టం చేశారు.

ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 175 అసెంబ్లీ స్థానాల్లో 2,186 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. 25 లోక్‌సభ స్థానాలకు 319 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 45,920 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 1,01,377 మంది ఉద్యోగులు ఎన్నికల విధుల్లో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 3.93 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఎల్లుడి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. 
Read Also : వీవీ ప్యాట్స్ లెక్కింపు : పొలిటికల్ పార్టీల్లో కొత్త ఆందోళన