Rahul Letter To SRK : దేశం మీ వెంటే..షారుఖ్ ఖాన్ కు రాహుల్ లేఖ

డ్రగ్స్ కు సంబంధించిన ఆరోపణలపై ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సమయంలో అతని తండ్రి షారుఖ్ ఖాన్ కు అనేక మంది సినీ నటుల నుండి మరియు మహారాష్ట్రలోని

Rahul Letter To SRK : దేశం మీ వెంటే..షారుఖ్ ఖాన్ కు రాహుల్ లేఖ

Rahul

Rahul Letter To SRK డ్రగ్స్ కు సంబంధించిన ఆరోపణలపై ఆర్యన్ ఖాన్ ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సమయంలో అతని తండ్రి షారుఖ్ ఖాన్ కు అనేక మంది సినీ నటుల నుండి మరియు మహారాష్ట్రలోని అధికార శివసేన మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) నుండి కూడా మద్దతు లభించిన విషయంమ తెలిసిందే. అయితే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా షారూఖ్ ఖాన్‌కు మద్దతు తెలుపుతూ రాసిన ఓ లేఖ వ్యవహారం తాజాగా ఇప్పుడు బయటికొచ్చింది.

ఆర్యన్ ఖాన్ ను ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలుకి తరలించిన ఆరు రోజుల తర్వాత అక్టోబర్ 14న రాహుల్ గాంధీ.. షారుఖ్ ఖాన్ కు ఓ లేఖ రాశారు. ఇలాంటి కఠిన సమయంలో దేశం మొత్తం షారుఖ్ కు అండగా ఉందని లేఖలో రాహుల్ పేర్కొన్నారు. కాగా,డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్‌కు ఎట్టకేలకు బాంబే హైకోర్టు అక్టోబర్-28,2021న బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. 29 రోజుల పాటు ఆర్యన్ ఖాన్ జైలులో గడిపాడు.

అసలేంటీ కేసు
అక్టోబర్-2న ముంబైలో కోర్డేలియా క్రూయీజ్ ఎంప్రెస్ షిప్‌లో జరిగిన రేవ్ పార్టీలో భారీ ఎత్తున డ్రగ్స్ రాకెట్ బయటపడింది. ఈ రేవ్‌ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్ చెలామణి అవుతుందని విశ్వసనీయ సమాచారం రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్‌ బ్యూరో (NCB) అధికారులు అక్టోబర్-2 అర్ధరాత్రి దాడులు జరిపి అధిక మొత్తంలో కొకైన్‌ సహా ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అందులోనే ఉన్న యువతీ యువకులను అదుపులోకి తీసుకున్నారు.

ఎన్సీబీ టీమ్ అదుపులోకి తీసుకున్న వారిలో బాలీవుడ్‌ హీరో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా ఉన్నాడు. విచారణలో ఉన్న ఆర్యన్‌ ఖాన్‌కు త్వరగానే బెయిల్ లభిస్తుందని అంతా భావించారు. కానీ ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌ను పలుమార్లు కోర్టు కొట్టివేసింది.

అయితే ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆధారాలు కనుగొనబడనప్పటికీ.. అతని వాట్సాప్ చాట్‌లు “అక్రమ మాదకద్రవ్యాల ఒప్పందాలు” మరియు విదేశీ డ్రగ్స్ వ్యాపార ముఠాతో సంబంధాలు కలిగి ఉన్నట్లు రుజువు చేసినట్లు NCB కోర్టులో పేర్కొంది. నిందితుల్లో ఒకరు ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ సరఫరా చేశాడని నిర్ధారించడానికి వాట్సాప్ చాట్‌లు సరిపోవని హైకోర్టు ఆ తర్వాత పేర్కొంది. ఎట్టకేలకు బాంబే హైకోర్టు ఆర్యన్‌ ఖాన్ కు అక్టోబర్-28న బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ALSO READ Covaxin: ఇండియన్స్‌‌కి గుడ్ న్యూస్.. భారత్ బయోటెక్ కొవాగ్జిన్‌కు WHO అనుమతి