Drone To Fly With Human : మనిషి ప్రయాణించే తొలి దేశీయ డ్రోన్‌.. త్వరలో భారత నేవీ అమ్ములపొదలోకి..

డ్రోన్ల తయారీ, రవాణాలో కొత్త శకం మొదలైంది. ఇప్పటివరకు సర్వేలు చేసేందుకు, విలువైన సమాచారాన్ని ఫొటోల రూపంలో నిక్షిప్తం చేసేందుకు, అత్యవసర వస్తువులను రవాణా చేసేందుకు డ్రోన్లను వినియోగించేవారు. ఇకపై మనిషి ప్రయాణించే డ్రోన్‌ వచ్చేంది. దేశీయంగా తయారైన డ్రోన్‌ ‘వరుణ్‌’ త్వరలో భారత నౌకాదళం అమ్ములపొదిలో చేరనుంది.

Drone To Fly With Human : మనిషి ప్రయాణించే తొలి దేశీయ డ్రోన్‌.. త్వరలో భారత నేవీ అమ్ములపొదలోకి..

drone Varun

Drone To Fly With Human : డ్రోన్ల తయారీ, రవాణాలో కొత్త శకం మొదలైంది. ఇప్పటివరకు సర్వేలు చేసేందుకు, విలువైన సమాచారాన్ని ఫొటోల రూపంలో నిక్షిప్తం చేసేందుకు, అత్యవసర వస్తువులను రవాణా చేసేందుకు డ్రోన్లను వినియోగించేవారు. ఇకపై మనిషి ప్రయాణించే డ్రోన్‌ వచ్చేంది. దేశీయంగా తయారైన డ్రోన్‌ ‘వరుణ్‌’ త్వరలో భారత నౌకాదళం అమ్ములపొదిలో చేరనుంది. మనిషి ప్రయాణించే డ్రోన్ల తయారీలో ఆమెరికా సరసన భారత్‌ నిలిచింది.

తొలిసారిగా దేశీయంగా తయారైన ఈ రకం డ్రోన్లు త్వరలో భారత నావికా దళంలో చేరనున్నాయి. ఈ డ్రోన్‌కు వరుణ్‌ అని పేరు పెట్టారు. దాదాపు 100 కిలోల బరువును మోసుకెళ్లే డ్రోన్లు తయారయ్యాయి. కేవలం 30 నిమిషాల్లో 25 నుంచి 30 కి.మీ. దూరం ప్రయాణం చేయగలవు. పూణెకు చెందిన భారతీయ స్టార్టప్ సంస్థ సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ డ్రోన్‌ను అభివృద్ధి చేసింది. ఈ విషయాలను ఇండియన్‌ నేవీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Drones In Power Transmission: విద్యుత్ టవర్ల పర్యవేక్షణ కోసం డ్రోన్లు.. తొలిసారిగా వినియోగిస్తున్న మధ్యప్రదేశ్

గాలిలో సాంకేతిక లోపం ఏర్పడిన తర్వాత కూడా ఈ రకం డ్రోన్లు సురక్షితంగా భూమిపై ల్యాండ్‌ అవుతాయని సాగర్‌ డిఫెన్స్‌ కంపెనీ సహ వ్యవస్థాపకుడు బబ్బర్ పేర్కొన్నారు. ఈ డ్రోన్‌లో ఒక పారాచూట్‌ ఉంటుంది. ఇది అత్యవసర సమయంలో లేదా మాల్‌ ఫంక్షన్‌ సమయంలో ఆటోమెటిక్‌గా తెరుచుకుంటుంది. దాంతో డ్రోన్ సురక్షితంగా భూమిపై ల్యాండ్ అవుతుంది.

ఈ రకం డ్రోన్లను ఎయిర్ అంబులెన్స్‌, సుదూర ప్రాంతాలకు వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగించవచ్చు. వీటిని గత జూలై నెలలో విజయవంతంగా పరీక్షించారు. ఈ డ్రోన్లతో దేశ నిఘా, భద్రత మరింత పటిష్టం అవుతుందని ఇండియన్‌ నేవీ వెల్లడించింది. అలాగే అత్యవసర వైద్య సేవల పరిస్థితుల్లో కూడా వీటిని ఉపయోగించవచ్చునని పేర్కొంది. ఇది ఇలావుంటే మనిషి ప్రయాణించే డ్రోన్లను అమెరికా 2016 లోనే తయారు చేసింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.