పోర్న్ సైట్‌లో దంపతుల శృంగారం వీడియో.. షాక్‌లో జంట.. అసలేం జరిగిందంటే..

కోల్‌కతాలోని ఓ జంటకు దిమ్మతిరిగిపోయే షాక్ తగిలింది. తమ ఇంట్లోని బెడ్ రూమ్ లో ఇద్దరూ కలిసున్న దృశ్యాలు, శృంగార వీడియో పోర్న్ సైట్ లో దర్శనమిచ్చింది.

పోర్న్ సైట్‌లో దంపతుల శృంగారం వీడియో.. షాక్‌లో జంట.. అసలేం జరిగిందంటే..

couple bed room video in pornsite: కోల్‌కతాలోని ఓ జంటకు దిమ్మతిరిగిపోయే షాక్ తగిలింది. తమ ఇంట్లోని బెడ్ రూమ్ లో ఇద్దరూ శృంగారం చేస్తున్న దృశ్యాలు పోర్న్ సైట్ లో దర్శనమిచ్చాయి. అంతే, ఆ జంటకు దిమ్మతిరిగిపోయింది. దీంతో వారు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. విచారణలో అంతకంటే విస్తుపోయే నిజం బయటపడింది.

కోల్ కతాలో ఓ జంట నివాసం ఉంటుంది. ఓ రోజు భర్త తన ఫోన్ లో పోర్న్ సైట్ చూస్తున్నాడు. అందులో అతడికి షాకింగ్ వీడియో ఒకటి కనిపించింది. ఆ వీడియాలో తను, తన భార్య ఉన్నారు. అది తమ బెడ్ రూమ్ లోని శృంగారానికి సంబంధించిన వీడియో. దీంతో ఆ భర్త షాక్ తిన్నాడు. ఆ వీడియోను ఎవరు, ఎలా తీశారో అర్థం కాలేదు. పోర్న్‌సైట్‌లో ఎలా అప్ లోడ్ అయ్యిందో కూడా తెలియలేదు. వెంటనే ఇంట్లోని బెడ్ రూమ్ లోకి పరుగులు తీశాడు. ఎక్కడైనా సీక్రెట్ కెమెరాలు పెట్టారేమోనని అంతా వెతికాడు. కానీ ఏమీ దొరకలేదు. దీంతో అతడు మరోదారి లేక సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. వారి గదిలో స్మార్ట్ టీవీ ఉంది. అందులో ఇన్ బిల్ట్ కెమెరా ఉంది. ఆ టీవీ వైఫైకి కనెక్ట్ అయ్యి ఉంది. దీంతో స్మార్ట్ టీవీని విదేశాల్లోని హ్యాకర్లు ఆన్ లైన్ ద్వారా హ్యాక్ చేశారని సైబర్ నిపుణులు గుర్తించారు. టీవీలో ఉన్న కెమెరా సాయంతో దంపతులు కలిసున్న విజువల్స్ ని హ్యాకర్ రికార్డ్ చేశాడని, ఆ తర్వాత దాన్ని అశ్లీల్ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశాడని కనుగొన్నారు.

ఈ వార్త బాధిత దంపతులనే కాదు.. ఇళ్లలో ల్యాప్ ట్యాప్ లు, స్మార్ట్ టీవీలు ఉండే అందరిని కలవరానికి గురి చేసింది. ఈ ఘటన నేపథ్యంలో సైబర్ నిపుణుల కీలక సూచనలు చేశారు. అవసరం లేని సమయంలో ల్యాప్ ట్యాప్, స్మార్ట్ టీవీల కెమెరాలకు స్టిక్కర్ అంటించుకోవడం మంచిదని సూచించారు. అంతేకాదు ఎప్పటికప్పుడు వైఫై పాస్ వర్డ్స్ మార్చుకోవాలని, పడుకునే ముందు కచ్చితంగా వైఫై ఆఫ్ చేయాలని సూచించారు.

అలాగే.. స్మార్ట్ టీవీ కొనుగోలు విషయంలోనూ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. తక్కువ ధరకు వస్తాయని.. గుర్తు తెలియని కంపెనీల టీవీలు కొనుగోలు చేస్తే ఇలాంటి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. వాస్తవానికి స్మార్ట్ టీవీని భారతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా చేయాల్సి ఉంటుంది. కానీ, కొన్ని విదేశీ కంపెనీలు అలాంటి పని చెయ్యడం లేదు. సో, చివరిగా చెప్పేది ఏంటంటే.. బెడ్ రూమ్ లో శృంగారం చేసేటప్పుడు జరజాగ్రత్త అని పోలీసులు అంటున్నారు.