జంటకు బట్టలు విప్పించి.. మెడలో చెప్పులు దండలు

జంటకు బట్టలు విప్పించి.. మెడలో చెప్పులు దండలు

జార్ఖండ్ లోని సహీబ్‌గంజ్ గ్రామ పంచాయతి ఓ జంటకు ఇచ్చిన తీర్పు చాలా దారుణం. మెడలో చెప్పుల దండ వేయడంతో పాటు బట్టలు విప్పించి ఊరేగించారు. కొందరు జోక్యం చేసుకుని విషయాన్ని కాంప్రమైజ్ చేశారు. సీన్ లోకి పోలీసులు ఎంటర్ అవడంతో ఆ జంట సేఫ్ అయింది.

సహీబ్ గంజ్ ప్రాంతంలోని జుహీబోనా గ్రామంలో ఈ ఘటన జరిగింది. బకూరీకి చెందిన మహిళకు మడీకోలా గ్రామంలో వివాహం జరిగింది. రీసెంట్ గా ఆమె శివ పహాడ్ ప్రాంతంలోని బంధువులతో పాటు ఉండటానికి వచ్చింది. ఆక్కడే జుహీబోనా గ్రామానికి చెందిన వ్యక్తి పరిచయ్యమయ్యాడు.

అతనితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని కొందరు గ్రామస్థులు పంచాయతీ పెట్టారు. మీటింగ్ లో ఆ వ్యక్తికి రూ.5లక్షల జరిమానా విధించారు. అంతేకాకుండా పంచాయతీ ఆర్డర్ ప్రకారం.. ఆ జంటకు చెప్పుల దండ వేయడంతో పాటు, బట్టలు విప్పి గ్రామమంతా ఊరేగించారు. సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వచ్చి వారిని కాపాడారు.