Rape Murder Case : బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి ఉరిశిక్ష రద్దు చేసిన హైకోర్టు.. వెంటనే విడుదల చేయాలని ఆదేశం

బాలిక పై అత్యాచారం కేసులో మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. 13ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులో దోషికి కింది కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు రద్దు చేసింది. అంతేకాదు అతడికి స్వేచ్చను ప్రసాదించింది.

Rape Murder Case : బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి ఉరిశిక్ష రద్దు చేసిన హైకోర్టు.. వెంటనే విడుదల చేయాలని ఆదేశం

Court Acquits Rape And Murder Convict

Court acquits rape-and-murder convict: బాలిక పై అత్యాచారం కేసులో మద్రాస్ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. 13ఏళ్ల బాలికపై అత్యాచారం జరిపి హత్య చేసిన కేసులో దోషికి కింది కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు రద్దు చేసింది. అంతేకాదు అతడికి స్వేచ్చను ప్రసాదించింది. చెంగల్పట్టు జిల్లాకు చెందిన ఎల్ అశోక్‌కుమార్‌ (25) 2017లో 13 ఏళ్ల బాలికపై హత్యాచారం కేసులో అరెస్ట్ య్యాడు. కేసు విచారణ జరిపిన చెంగల్పట్టు ప్రత్యేక కోర్టు అశోక్‌కుమార్‌ ను దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధిస్తూ 2019లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మద్రాసు హైకోర్టులో అశోక్‌కుమార్‌ రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. పిటిషన్ విచారించిన హైకోర్టు ఉరి శిక్ష రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.

ఈ సందర్భంగా పోలీసులపై హైకోర్టు తీవ్రంగా మండిపడింది. కేసు విచారణలో లోపాలు ఉన్నాయని చెప్పింది. పోలీసుల సరైన రీతిలో దర్యాఫ్తు చేయలేదని వ్యాఖ్యానించింది. నేరం చేసినట్టు నిరూపిించేందుకు సరైన సాక్ష్యాలు లేనందున ఈ కేసులో యువకుడికి విధించిన ఉరిశిక్షను రద్దు చేస్తున్నట్టు కోర్టు చెప్పింది. అంతేకాదు ఇన్వెస్టిగేషన్ లో లోపాలపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

2017 జూలై 23న 13ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసినట్టు అశోక్ కుమార్ పై కేసు నమోదైంది. 2019 ఫిబ్రవరి 15న.. అశోక్ కుమార్ కి చెంగల్ పట్ మహిళా కోర్టు ఉరిశిక్ష విధించింది. బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో అశోక్ ఇంట్లోకి చొరబడి బాలకను అత్యాచారం చేసినట్టు బాధితురాలి కుటుంబసభ్యులు ఆరోపించారు.

ఈ కేసుని విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్.. డీఎన్ఏ ఫలితాన్ని పరిశీలించింది. బాధితురాలి దుస్తులపై లభించిన రక్తపు మరకలు ఓ పురుషుడికి సంబంధించినవి. అదే సమయంలో ఆ రక్తపు మరకలు అశోక్ కుమార్ వి కాదని స్పష్టంగా ఉంది. అదే సమయంలో బాధితురాలి టీషర్ట్, ప్యాంట్ పై లభించిన రక్తపు మరకల శాంపిల్స్ డీఎన్ఏ ఫలితాన్ని పరిశీలించారు. అవి మహిళ రక్తపు మరకలు అని తేలింది.

కానీ, ఆ రక్తపు మరకలు చనిపోయిన అమ్మాయివా కాదా అనేది మాత్రం నిర్ధారించలేదు. ఇలా పోలీసులు అన్నింటిలో విఫలం అయ్యారు. సరైన విచారణ చెయ్యలేదు. దీన్ని హైకోర్టు డివిజన్ బెంచ్ క్వశ్చన్ చేసింది. పోలీసుల దర్యాఫ్తుని కోర్టు తప్పుపట్టింది. సరైన ఆధారాలు సేకరించలేదని చెప్పింది. అత్యాచారం, హత్య కేసులో ఆధారాలను ధృవీకరించలేక పోయినందున, అశోక్ కుమార్‌ కి విధించిన ఉరిశిక్షను రద్దు చేయడమే కాకుండా వెంటనే విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో బాధితురాలి కుటుంబానికి రూ.5లక్షలు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.