Kerala: సోదరుడి ద్వారా గర్భం దాల్చిన మైనర్.. 7 నెలల గర్భాన్ని తొలగించేందుకు అనుమతిచ్చిన కోర్టు

బాలికను పరీక్షించేందుకు 15 మందితో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు పరిశీలించిన అనంతరం 32 వారాలకు పైగా గర్భం దాల్చడం వల్ల మానసిక ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా జస్టిస్ జియాద్ రెహమాన్‌తో కూడిన సింగిల్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది

Kerala: సోదరుడి ద్వారా గర్భం దాల్చిన మైనర్.. 7 నెలల గర్భాన్ని తొలగించేందుకు అనుమతిచ్చిన కోర్టు

High court: తన సోదరుడి ద్వారా గర్భం దాల్చిన మైనర్ బాలికకు 7 నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు కేరళ హైకోర్టు సోమవారం అనుమతించింది. మైనర్ బాలిక తండ్రి తన గర్భాన్ని తొలగించాలని కోర్టును కోరాడు. అబార్షన్‌ను అనుమతించకపోతే వివిధ సామాజిక, వైద్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కోర్టు పేర్కొన్న కోర్టు.. బాలిక తండ్రి వినతిని అంగీకరించి గర్భం తొలగించేందుకు అనుమతి ఇచ్చింది.

Congress and AAP: మొదటిసారి ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ

బాలికను పరీక్షించేందుకు 15 మందితో ఏర్పాటు చేసిన మెడికల్ బోర్డు పరిశీలించిన అనంతరం 32 వారాలకు పైగా గర్భం దాల్చడం వల్ల మానసిక ఆరోగ్యానికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ఆధారంగా జస్టిస్ జియాద్ రెహమాన్‌తో కూడిన సింగిల్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. “బిడ్డ తన సొంత తోబుట్టువు నుంచి జన్మించిన వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకుంటే, వివిధ సామాజిక, వైద్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితులలో గర్భం రద్దు తొలగించడం అనివార్యమే. అయితే దానికి పిటిషనర్ అనుమతి ముఖ్యం’’ అని కోర్టు పేర్కొంది.