మహారాష్ట్ర గవర్నర్ కాపీ కోరిన సుప్రీంకోర్టు

  • Published By: vamsi ,Published On : November 24, 2019 / 07:32 AM IST
మహారాష్ట్ర గవర్నర్ కాపీ కోరిన సుప్రీంకోర్టు

మహారాష్ట్ర రాజకీయాలు సుప్రీంకోర్టుకు చేరుకోగా.. ఎమ్మెల్యేలను మభ్య పెట్టకుండా వెంటనే బల పరీక్ష నిర్వహించాలంటూ శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ పార్టీలు పిటిషన్‌ దాఖలు చేశాయి. దీనిపై జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం అత్యవసర విచారణ ప్రారంభించింది. విచారణ అనంతరం కీలక ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు.  రేపు(25 నవంబర్ 2019) ఉదయం 10గంటల 30నిమిషాలకు గవర్నర్‌కు బలం ఉందంటూ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖను ప్రవేశపెట్టాలని ఆదేశించింది. 

గవర్నర్ ఆదేశాల కాపీని సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాంగ్రెస్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కపిల్‌సిబాల్‌, బీజేపీ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేలా గవర్నర్‌కు ఆదేశాలు జారీ చేయాలని మూడు పార్టీలు సుప్రీంకు విజ్ఞప్తి చేశాయి. అయితే మహా రాజకీయంపై విచారణ జరిపిన కోర్టు ఫడ్నవీస్ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఊరట కల్పించింది.

మహారాష్ట్ర గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమా? కాదా? అనేది గవర్నర్ ఆదేశాల కాపీని సమర్పించిన తర్వాత నిర్ణయిస్తామని, వెంటనే బలపరీక్ష పెట్టాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రేపు ఉదయం 10గంటల 30నిమిషాలకు తుది తీర్పు ఇస్తామని వెల్లడించింది. రాష్ట్రపతి పాలన తొలగించాలని గవర్నర్ సిఫార్సు చేయడం.. దురుద్దేశంతో కూడిన వ్యవహారం అని గవర్నర్ ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లుగా కాంగ్రెస్ తరపున వాదిస్తున్న లాయర్ కపిల్ సిబాల్ వాదించారు. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది.