Delhi Liquor Scam Case : కవిత విచారణకు రాలేదు కాబట్టి అరుణ్ పిళ్లై కస్టడీ పొడిగించాలని కోరిన ఈడీ .. అంగీకరించిన కోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీ అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీని పొడిగించింది కోర్టు. ఈరోజు ఈడీ విచారణకు హాజరు కావాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరుకాలేదు. దీంతో పిళ్లై కస్టడీని పొడిగించాలని ఈడీ కోరటంతో కోర్టు అంగీకరిస్తూ పిళ్లై కస్టడీని పొడిగించింది.

Delhi liquor scam case : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీ అరుణ్ రామచంద్ర పిళ్లై పరిస్థితి ఎలా ఉందంటే ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది అన్నట్లుగా ఉంది. ఈరోజు (గురువారం,మార్చి 16,2023)న మరోసారి ఈడీ విచారణకు హాజరు కావాల్సిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణకు హాజరుకాలేదు. ఈడీ కార్యాలయంలో మహిళలను విచారించకూడదని కానీ ఈడీ ఈ నిబంధనలను ఉల్లంఘించిందని దీనిపై తాను సుప్రీంకోర్టులో పిటీషన్ వేశానని దానికి సంబంధించిన కేసు మార్చి 24న సుప్రీంకోర్టులో విచారణ జరిగాకే ఈడీ విచారణకు హాజరవుతానని ఈడీకి కవిత సమాచారం ఇచ్చారు. దీంతో పిళ్లై కస్టడీని పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు.కవిత విచారణకు రాలేదా? అని ప్రశ్నించి మరీ పిళ్లై కస్టడీని పొడిగించటం గమనించాల్సిన విషయం.

MLC Kavitha-Delhi liquor Scam: మహిళలను కార్యాలయానికి పిలిచి విచారించకూడదు: ఎమ్మెల్సీ కవిత లేఖ

ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తాను ఎమ్మెల్సీ కవిత బినామీని అని ఈడీ విచారణలో చెప్పి తరువాత మాట మార్చిన అరుణ్ రామచంద్ర పిళ్లైకు ఈరోజుతో (మార్చి16,2023) ఈడీ కస్టడీ ముగిసింది. దీంతో ఈడీ అధికారులు పిళ్లైను కోర్టులో ప్రవేశపెట్టారు ఈడీ అధికారులు. ఈ సందర్భంగా కోర్టు కవిత విచారణకు వచ్చారా? అని ఈడీ అధికారులను ప్రశ్నించింది. రాలేదని సమాధానమిచ్చారు అధికారులు. కవిత విచారణకు రాలేదని..కవితతో కలిపి పిళ్లైను మరోసారి విచారించాలని కాబట్టి పిళ్లై కస్టడీని పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. దీంతో కోర్టు పిళ్లై కస్టడీని సోమవారం (మార్చి20,2023) వరకు పొడిగింది. ఇప్పటికే కవిత మాజీ ఆడిటర్ కూడా ఈ కేసులో ముద్దాయిగా ఉన్న విషయం తెలిసిందే. బుచ్చిబాబును ఈడీ అరెస్ట్ చేయటం విచారించటం వంటివి జరిగాయి. కొన్ని రోజులకు బుచ్చిబాబుకు బెయిల్ దొరికి బయటకు వచ్చారు. కవిత ఈడీ విచారణకు హాజరాకపోవటం..అరుణ్ పిళ్లై కస్టడీని పొడిగించటమే కాకుండా బుచ్చిబాబుకు మరోసారి ఈడీ నోటీసులు ఇచ్చింది. విచారణకు రావాలని ఆదేశించింది. దీంతో బుచ్చిబాబు రేపు అంటూ మార్చి 17న ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇలా కవిత బినామీ అని పేరొందిన అరుణ్ పిళ్లై, కవిత మాజీ ఆడిటర్  బుచ్చిబాబు కూడా ఈ కేసులో నిందితులుగా ఉండటంతో కవిత ఈ కేసులో ఎంతగా చిక్కుకున్నారో అర్థమవుతోందనే అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

కాగా..మార్చి 11న ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన కవితను మార్చి 16న మరోసారి విచారణకు రావాలని ఈడీ ఆదేశించింది. ఈక్రమంలో కవిత ఈడీ విచారణకు హాజరుకాలేదు. దీనికి పలు కారణాలు చెప్పుకొచ్చారు. తాను చట్ట సభ ప్రతినిధిగా, చట్ట విరుద్ధంగా జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి తన ముందు ఉన్న అన్ని అవకాశాలనూ వాడుకుంటానని అన్నారు. మహిళలను ఆఫీసుకి పిలిపించి విచారించకూడదని..తాను ఆడియో, వీడియో రూపంలో విచారణకు సన్నద్ధంగానే ఉన్నానని…లేదంటే అధికారులు తన ఇంటికి వచ్చి విచారణ కొనసాగించవచ్చని చెప్పారు.

MLC Kavitha-Delhi liquor scam: విచారణకు హాజరుకాలేనన్న కవిత.. ఢిల్లీలో నాటకీయ పరిణామాలు

తనను రాత్రి 8 గంటల వరకు విచారించారని కవిత చెప్పారు. తనను ఇవాళ విచారణకు రావాలని చెప్పారని, అయితే, వ్యక్తిగతంగా రావాలని మాత్రం సమన్లలో ఎక్కడా చెప్పలేదని అన్నారు. తన ప్రతినిధిగా భరత్‌ ను ఈడీ వద్దకు పంపానని తెలిపారు కవిత. ఇలా కవిత విచారణకు రాకపోవటంతో ఆమె బినామీ అయిన అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీని ఈడీ మరోసారి కోరటంతో కోర్టు పిళ్లై కస్టడీని పొగించింది. బహుశా కవిత ఈరోజు ఈడీ విచారణకు హాజరై ఉంటే బహుశా పిళ్లైకు ఈడీ కస్టడీ నుంచి తాత్కాలికంగా విముక్తి లభించే అవకాశం ఉండేదని పలువురు భావిస్తున్నారు.

Delhi Liquor Scam : మరోసారి ఈడీ విచారణకు కవిత..మంత్రులు, ఎమ్మెల్యేలు సహా అంతా ఢిల్లీలోనే.. అరెస్ట్ చేస్తే ఆందోళనకు రెడీగా ఉన్న గులాబీ దళం

 



ట్రెండింగ్ వార్తలు