Covaxin: డెల్టా, డెల్టా ప్లస్‌పై అధ్యయనం.. మూడో వేవ్‌ను రెండు వ్యాక్సిన్లు అడ్డుకుంటాయా?

దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే డెల్టా వేరియంట్ కరోనావైరస్ అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా ఉద్భవించింది.

Covaxin: డెల్టా, డెల్టా ప్లస్‌పై అధ్యయనం.. మూడో వేవ్‌ను రెండు వ్యాక్సిన్లు అడ్డుకుంటాయా?

Do You Need Covid Vaccine Booster Shots And When

Covaxin and Covishield: దేశంలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ మళ్లీ విస్తరిస్తోంది. ఈ క్రమంలోనే డెల్టా వేరియంట్ కరోనావైరస్ అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా ఉద్భవించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఇన్‌ఫెక్షన్ల సంఖ్యలో పెరుగుదలకు కారణం అవుతోంది. ఈ వేరియంట్‌కు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ల ప్రభావం ఎంత అనేది ఇప్పటివరకు అర్థం కాలేదు. ఫైజర్, మోడర్నా, స్పుత్నిక్ V, ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా వంటి అన్ని టీకాలు గతంలో డెల్టాకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ భారతదేశంలో రెండు ప్రధాన వ్యాక్సిన్‌లైన కోవిషీల్డ్ మరియు కోవాక్సిన్‌లపై నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ICMR అధ్యయనం ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనావైరస్ వ్యాక్సిన్ కోవాగ్జిన్‌ సామర్థ్యానికి సంబంధించిన మరో కీలక విషయం వెల్లడైంది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ డెల్టా ప్లస్ వేరియంట్‌పై సమర్థంగా పనిచేస్తోందని తేలింది. దేశంలో కరోనా వ్యాప్తి, వ్యాక్సిన్ల పనితీరుపై భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) జరిపిన అధ్యయనంలో దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ ఉధృతికి కారణంగా భావించిన డెల్టా వేరియంట్ నుంచి కోవాగ్జిన్ వ్యక్సిన్ మెరుగైన రక్షణ కల్పిస్తోంది. దీంతోపాటు డెల్టా ప్లస్ వేరియంట్‌ను కూడా ఈ వ్యాక్సిన్ సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు ఐసీఎంఆర్ స్పష్టం చేసింది.

ఐసీఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ(ఎన్ఐవీ) సహకారంతో భారత్ బయోటెక్ సంస్థ కోవాగ్జిన్ వ్యాక్సిన్‌ను అభివృద్ది చేసింది. ఇదే సమయంలో డెల్టా ప్లస్ వేరియంట్‌పై ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిషీల్డ్ కూడా ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. “డెల్టా వేరియంట్‌పై ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సామర్థ్యం 90 శాతం పనిచేయదు కానీ, ప్రభావవంతంగానే ఉందని, అధ్యయనంలో తేలింది. అయితే ఈ రెండు వ్యాక్సిన్ల సింగిల్ డోసు మాత్రమే తీసుకున్నప్పుడు.. టీకాల సగటు ప్రభావశీలత తెక్కువగా ఉందని రెండు డోసుల తర్వాత ప్రభావం చాలా బలంగా ఉందని వెల్లడించారు.

పూర్తిగా వ్యాక్సిన్‌లు వేయించుకున్న వ్యక్తులపై నిర్వహించిన నిజ జీవిత అధ్యయనాల్లో ఈ విషయం వెల్లడి కాగా.. మూడవ వేవ్‌లో ఈ వేరియంట్‌లను ఎదుర్కోవడంలో మాత్రం వ్యాక్సిన్లు బలంగా పనిచేస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.