Covaxin : కోవాగ్జిన్ కు మరికొన్ని గంటల్లో WHO అనుమతి!

కోవిడ్ కట్టడి కోసం హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన "కోవాగ్జిన్" కు మరికొన్ని గంటల్లోనే WHO అనుమతి దక్కనుంది. ఇప్పటివరకు కోవాగ్జిన్ వినియోగానికి

Covaxin : కోవాగ్జిన్ కు మరికొన్ని గంటల్లో WHO అనుమతి!

Vaccine

Covaxin కోవిడ్ కట్టడి కోసం హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన “కోవాగ్జిన్” కు మరికొన్ని గంటల్లోనే WHO అనుమతి దక్కనుంది. ఇప్పటివరకు కోవాగ్జిన్ వినియోగానికి ప్రపంచ ఆరోగ్యసంస్థ(WHO) అధికారంగా ఆమోదం తెలపని విషయం తెలిసిందే. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(WHO)చెందిన సాంకేతిక కమిటీ…కోవాగ్జిన్ ఆమోదానికి సంబంధించి ఇవాళ రివ్యూ చేపట్టనుంది. రాబోయే 24 గంటల్లోనే కోవాగ్జిన్ వాడకానికి సంబంధించి డబ్యూహెచ్ వో ఆమోదం తెలపనుందని భావిస్తున్నట్లు WHO ప్రతినిధి తెలిపారు.

కాగా, భారత్ బయోటెక్ సంస్థ ఈ ఏడాది ఏప్రిల్-19న కోవాగ్జిన్ ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్(EUL)కోసం డబ్యూహెచ్ వోకి కి EOI(ఆసక్తి వ్యక్తీకరణ)సమర్పించింది. అయితే ఆమోదం తెలపడంలో ఆలస్యంపై డబ్యూహెచ్ వో స్పందిస్తూ..అత్యవసర ఉపయోగం కోసం ఒక ఉత్పత్తిని సిఫార్సు చేసే ముందు మూలలను కట్ చేయలేమని తెలిపింది. కోవాగ్జిన్ సురక్షితంగా మరియు ప్రభావవంతంగా ఉందని నిర్ధారించుకోవడానికి దానిని పూర్తిగా విశ్లేషించాల్సిన అవసరం ఉందని WHO తెలిపింది.

WHO ఎమర్జెన్సీ యూజ్ లిస్టింగ్ (EUL) విధానం అనేది… పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ కారణంగా ప్రభావితమైన వ్యక్తులకు ఈ ఉత్పత్తుల లభ్యతను వేగవంతం చేసే అంతిమ లక్ష్యంతో లైసెన్స్ లేని వ్యాక్సిన్‌లను అంచనా వేయడానికి మరియు జాబితాలో చేర్చడానికి సంబంధించిన ప్రమాద-ఆధారిత ప్రక్రియ. కోవాగ్జిన్ కు డబ్యూహెచ్ వో ఆమోదం లభిస్తే..కోవాగ్జిన్ వ్యాక్సిన్ ను తీసుకున్న భారతీయులకు అంతర్జాతీయ ప్రయాణాన్ని సులభతరం అవుతుంది.

డబ్యూహెచ్ వో ఆమోదం ఆలస్యం వల్ల..విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు,వ్యాపారవేత్తలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎందుకంటేూ పలు దేశాలు.. డబ్యూహెచ్ వో అమోదిత వ్యాక్సిన్ సర్టిఫికెట్ ఉంటేనే క్వారంటైన్ వంటివి లేకుండా ఎయిర్ పోర్ట్ లో నుంచి బయటకు వెళ్లేందుకు అనుమతిస్తున్నాయి. డబ్యూహెచ్ వో ఆమోదం పొందని వ్యాక్సిన్లు తీసుకున్నవారికి క్వారంటైన్ లో ఉంచుతుండటంతో ముఖ్యంగా విద్యార్థులు,వ్యాపారవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ALSO READ Lakhimpur Kheri : వందల మంది రైతులుండగా సాక్ష్యులు 23మందేనా