Covaxin : కోవాగ్జిన్ తో ఏ స్ట్రెయిన్ అయినా అంతం

కరోనా కట్టడి కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)తో కలిసి హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన "కోవాగ్జిన్" వ్యాక్సిన్ అన్ని రకాల కరోనా స్ట్రెయిన్ ​లపైనా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు భారత్ బయోటెక్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.

Covaxin : కోవాగ్జిన్ తో ఏ స్ట్రెయిన్ అయినా అంతం

Covaxin

Covaxin కరోనా కట్టడి కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)తో కలిసి హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన “కోవాగ్జిన్” వ్యాక్సిన్ అన్ని రకాల కరోనా స్ట్రెయిన్ ​లపైనా ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు భారత్ బయోటెక్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. భారత్​లో వెలుగుచూసిన B.1.617, బ్రిటన్​లో వెలుగుచూసిన​ రకం B.1.1.7 స్ట్రెయిన్​ లను కూడా కోవాగ్జిన్ అంతం చేయగలదని స్పష్టం చేసింది.

వీటితో బాటు ఇతర వేరియంట్లపై కూడా ఈ వ్యాక్సిన్ తో టెస్ట్ చేసినప్పుడు వీటిని న్యూట్రలైజ్ (అదుపు) చేయగలగడంలో ఇది సఫలీకృతమైందని ఈ సంస్థ వెల్లడించింది. వ్యాక్సిన్ వేరియంట్ D614G తో పోల్చినప్పుడు B.1.617 శక్తి 1.95 వరకు తగ్గినట్లు తెలిపింది. ఇది కొంతమేర తగ్గినప్పటికీ B.1.617 వేరియంట్ కాన్ సెంట్రేషన్ లెవెల్స్ అనుకున్న లెవెల్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు అది సులభంగా న్యూట్రలైజ్ కాగలిగిందన్నారు. మొదట యూకేలో కనుగొన్న B.1.1.7 కి, ఆ తరువాత వ్యాక్సిన్ స్ట్రెయిన్ D614G కి మధ్య ‘తటస్థీకరణ’ లో తేడా కనబడిందన్నారు. జాతీయ వైరాలజీ సంస్థ(ఎన్ఐవీ), భారత వైద్య పరిశోధన మండలి(ICMR​) సంయుక్తంగా చేసిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడైనట్లు భారత్ బయోటెక్ తెలిపింది.

ఈ మేరకు భారత్​ బయోటెక్​ కో-ఫౌండర్​ సుచిత్ర ఎల్ల ట్వీట్​ చేశారు. క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అనే మెడికల్ జర్నల్ లో తమ అధ్యయనాన్ని ట్వీట్ లో పోస్ట్ చేశారు. కొత్త రకం స్ట్రెయిన్​ల నుంచి రక్షణ కల్పిస్తుందని సైంటిఫిక్ రీసెర్చ్ డేటా పబ్లిష్ కావడం వల్ల కొవాగ్జిన్​ మరోసారి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. భారత్​ బయోటెక్​ కిరీటంలో ఇది మలో కలికితురాయి అని సుచిత్ర ఎల్ల తన ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ ట్వీట్​లో ప్రధాని కార్యాలయంతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​లను ట్యాగ్​ చేశారు. కాగా,ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న మూడు వ్యాక్సిన్లలో కోవాగ్జిన్ ఒకటి.