Covaxin: ఇండియన్స్‌‌కి గుడ్ న్యూస్.. భారత్ బయోటెక్ కొవాగ్జిన్‌కు WHO అనుమతి

భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్‌కు WHO అనుమతి లభించింది.

Covaxin: ఇండియన్స్‌‌కి గుడ్ న్యూస్.. భారత్ బయోటెక్ కొవాగ్జిన్‌కు WHO అనుమతి

Covaxin Clearance

Covaxin: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్‌కు WHO అనుమతి లభించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (TAG) 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి అత్యవసర వినియోగం కోసం లిస్ట్ చేసిన వ్యాక్సిన్‌లలోకి కొవాగ్జిన్‌ని తీసుకుని వచ్చింది. భారతదేశంలో తయారు చేసిన కొవాగ్జిన్‌ను ఇకపై ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకోవచ్చునని సిఫార్సు చేసింది WHO.

కోవిడ్-19కి వ్యతిరేకంగా వ్యాక్సినేషన్‌లో భారత్‌కి పెద్ద విజయాన్ని అందించడంతో సపోర్ట్ చేసిన కోవాగ్జిన్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినియోగంలోకి రానుంది. హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్.. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌తో చేతులు కలిపి ‘మేడ్ ఇన్ ఇండియా’ వ్యాక్సిన్‌గా దీన్ని అందుబాటులోకి తీసుకుని వచ్చింది.

టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ భారత్ బయోటెక్ నుండి దాని తుది రిస్క్ అసెస్‌మెంట్ కోసం కొన్ని అదనపు వివరణలు కోరడంతో కొవాగ్జిన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అనుమతులు లభించడంలో జాప్యం జరిగింది.

కొవాగ్జిన్‌కు సంబంధించి అదనపు సమాచారం కావాలంటూ డబ్ల్యూహెచ్ఓకు చెందిన సాంకేతిక సలహా సంఘం భారత్ బయోటెక్‌ను కోరగా.. లేటెస్ట్‌గా సమగ్ర సమాచారం చూసిన తర్వాత కొవాగ్జిన్‌కు అనుమతులు జారీ చేసింది డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక సలహా సంఘం.

అత్యవసర వినియోగ జాబితాలో వ్యాక్సిన్ రావడంతో.. దీనిని ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో వినియోగించే వీలుంటుంది. అంతేకాదు.. కొవాగ్జిన్ రెండు డోసులు తీసుకున్నవారు ఇతర దేశాలకు ఎటువంటి ఆంక్షలు లేకుండా వెళ్లవచ్చు.