Covaxin: ముక్కు నుంచి వ్యాక్సిన్.. క్లినికల్‌ ట్రయల్స్‌కి కేంద్రం గ్రీన్‌సిగ్నల్

రెండేళ్ల నుంచి పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా‌కు వ్యాక్సిన్ వేయడమే ఏకైక మార్గంగా పరిశోధకులు చెబుతున్నారు.

Covaxin: ముక్కు నుంచి వ్యాక్సిన్.. క్లినికల్‌ ట్రయల్స్‌కి కేంద్రం గ్రీన్‌సిగ్నల్

Nasal

Covaxin: రెండేళ్ల నుంచి పట్టి పీడిస్తున్న మహమ్మారి కరోనా‌కు వ్యాక్సిన్ వేయడమే ఏకైక మార్గంగా పరిశోధకులు చెబుతున్నారు. పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ అందుకున్న తర్వాతే, కరోనా నుంచి ప్రజలు బయటపడే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సూదిమందు ద్వారానే వ్యాక్సినేషన్ ప్రక్రియ ఉంది.

ఇప్పుడు ప్రపంచంలోనే తొలిసారిగా ‘ముక్కు టీకా’ ద్వారా వ్యాక్సినేషన్ అభివృద్ధి చేస్తుంది భారత్‌ బయోటెక్‌ సంస్థ.. నాజల్‌ వ్యాక్సిన్‌ రెండు, మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కి ఇప్పటికే కేంద్రం అనుమతి ఇచ్చింది. ఈమేరకు ఓ ప్రకటనలో అనుమతిత లభించినట్లుగా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ(డీబీటీ) వెల్లడించింది. అడినోవైరల్‌ ఇంట్రానాసల్‌ వ్యాక్సిన్‌ (బీబీవీ154)గా పిలిచే ఈ వ్యాక్సిన్ ఫస్ట్ ఫేజ్ ట్రయల్స్‌ 18ఏళ్ల నుంచి 60ఏళ్ల వయస్సు గల వారిపై విజయవంతంగా నిర్వహించినట్లు వెల్లడించింది.

డీబీటీ, బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్‌ అసిస్టెన్స్‌ కౌన్సిల్‌ (బీఐఆర్‌ఏసీ) సహకారంతో భారత్‌ బయోటెక్‌ నాజిల్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నట్టు చెబుతున్నారు. ఈ వ్యాక్సిన్ స్ప్రే చేస్తే చాలు కండరాల్లో నుంచి వ్యాపించి మ్యూకస్‌ మెంబ్రిన్‌ను వేగంగా శోషించి ఇమ్యూనిటీ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. వ్యాధి నిరోధక కణాలు ముక్కు, నోరు, ఊపిరితిత్తుల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. వైరస్‌ శరీరంలోకి ప్రవేశించగానే ప్రతిఘటిస్తాయి.