Covaxin vs Covishield: ఓపెన్ మార్కెట్ ధర, ఎంత బాగా పనిచేస్తుంది, రెండో డోస్ టైమింగ్ తెలుసా..

అంతా Co-Win వెబ్ సైట్ లో తమ అడ్వాన్స్ డ్ బుకింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 28 నుంచి మొదలుకానున్న రిజిష్ట్రేషన్...

Covaxin vs Covishield: ఓపెన్ మార్కెట్ ధర, ఎంత బాగా పనిచేస్తుంది, రెండో డోస్ టైమింగ్ తెలుసా..

Corona Vaccine

Covaxin vs Covishield: మే1 నుంచి 18ఏళ్లు పై బడిన వారంతా కొవిడ్-19 వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ మేరకు అంతా Co-Win వెబ్ సైట్ లో తమ అడ్వాన్స్ డ్ బుకింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఏప్రిల్ 28 నుంచి మొదలుకానున్న రిజిష్ట్రేషన్ ప్రోసెస్.. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం విడివిడిగా చేపడుతున్న వ్యాక్సిన్ ప్రక్రియ జరుగుతుంది.

ఇప్పటి వరకూ ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనెకాతో కలిసి తయారుచేసిన కొవీషీల్డ్ వ్యాక్సిన్, సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, భారత్ బయోటెక్ కొవాక్సిన్ లు అందుబాటులో ఉండనున్నాయి. ఆ తర్వాత దిగుమతి అయిన వ్యాక్సిన్ పూర్తిగగా రెడీగా ఓపెన్ మార్కెట్ లో అందుబాటులోకి రానున్నాయి.

వ్యాక్సిన్ తీసుకునే ముందు ఏది ఎలా పని చేస్తుందో.. ఎంత ధర ఉందో.. ఓ సారి తెలుసుకుందాం..

సామర్థ్యం
రెండు వ్యాక్సిన్లు రెండు డోసులు తీసుకోవాల్సిందే. కొవీషీల్డ్ పూర్తి సామర్థ్యం 70శాతం కాగా, అది 90వరకూ సమర్థవంతంగా పనిచేయొచ్చు. ఒక నెల తర్వాత రెండో డోస్ వేసుకుంటే పూర్తి డోస్ వేసుకున్నట్లు అవుతుంది.

కొవాక్సిన్ మొదటి డోస్ 78శాతం పనితనం చూపిస్తుండగా రెండో డోస్ 100శాతం సమర్థవంతంగా పనిచేస్తుంది. కొవిడ్-19 వైరస్ వచ్చినా ఎఫెక్టివ్ గా ఎదుర్కోగలం.

ధర
కొవీషీల్డ్ ధర రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.400 వరకూ పలుకుతుండగా, ప్రైవేట్ హాస్పిటల్స్ లో రూ.600వరకూ పలుకుతుంది. మరోవైపు కొవాగ్జిన్ ధర రూ.600 రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.1200కు ప్రైవేట్ హాస్పిటల్స్ కు అమ్మనున్నారు. ఎంత చెల్లించి ఏది వేయించుకుంటారో మీ ఇష్టం.

రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేసే హాస్పిటల్స్ లో స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ ఆధారంగా వ్యాక్సిన్ వేసుకోవచ్చు. మధ్య ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కేరళ, గోవా, చత్తీస్ గడ్, కేరళ, ఉత్తరప్రదేశ్, అస్సాం, సిక్కిం, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వ్యాక్సిన్ ఉచితం అని ప్రకటించారు.

కేవలం 18 నుంచి 44ఏళ్లు మధ్య వయస్సున్న వారు మాత్రమే వ్యాక్సిన్ కోసం చెల్లించాల్సి ఉంటుంది. హెల్త్ కేర్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లు 45ఏళ్లు పైబడ్డ వారు ముందులాగే ఉచితంగా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.

ఓపెన్ మార్కెట్లో వ్యాక్సిన్ ధర
ఇండియాలోని ప్రైవేట్ హాస్పిటల్స్ లో రూ.600 నుంచి రూ.1200 వరకూ ఉంటుండగా ఇది ప్రపంచంలోనే అత్యధిక ధర.

సెకండ్ డోస్ ఎప్పుడు తీసుకోవాలి

కొవాగ్జిన్ తీసుకుని ఉంటే రెండో డోస్ నాలుగు నుంచి ఆరు వారాల్లోగా… కొవీషీల్డ్ తీసుకుంటే రెండో 4 నుంచి 8వారాల్లోగా తీసుకోవాలి.