బ్రెజిల్, సౌతాఫ్రికా కరోనా స్ట్రెయిన్లపైనా కోవ్యాగ్జిన్ పని చేస్తుంది.. ఆధారం ఇదిగో

భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాగ్జిన్ బ్రెజిల్, సౌతాఫ్రికా కరోనా స్ట్రెయిన్లపై పని చేస్తుందని నిర్ధరణ అయ్యింది. ఈ మేరకు ఆధారం లభించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) నిపుణుడు ఈ విషయాన్ని చెప్పారు. జనవరిలో జరిగిన అధ్యయనంలో కోవ్యాగ్జిన్ టీకా... బ్రిటన్ స్ట్రెయిన్ నుంచి కాపాడుతుందని తేలింది.

బ్రెజిల్, సౌతాఫ్రికా కరోనా స్ట్రెయిన్లపైనా కోవ్యాగ్జిన్ పని చేస్తుంది.. ఆధారం ఇదిగో

Covaxin

Covaxin works on Brazil, SA strains: భారత్ బయోటెక్ తయారు చేసిన కోవ్యాగ్జిన్ బ్రెజిల్, సౌతాఫ్రికా కరోనా స్ట్రెయిన్లపై పని చేస్తుందని నిర్ధరణ అయ్యింది. ఈ మేరకు ఆధారం లభించింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) నిపుణుడు ఈ విషయాన్ని చెప్పారు. జనవరిలో జరిగిన అధ్యయనంలో కోవ్యాగ్జిన్ టీకా… బ్రిటన్ స్ట్రెయిన్ నుంచి కాపాడుతుందని తేలింది.

కాగా, తాజా అధ్యయనంలో బ్రెజిల్, సౌతాఫ్రికా స్ట్రెయిన్లపైనా కోవ్యాగ్జిన్ పని చేస్తుందని స్పష్టమైంది. అయితే కొత్త ఫలితాల పరిశీలన ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నట్టు ఐసీఎంఆర్ ఎపిడెమోలజీ అండ్ కమ్యునికబల్ డిసీజస్ విభాగం అధిపతి డాక్టర్ సమిరన్ పాండా తెలిపారు. మాకు ఇంకా పూర్తి సమాచారం అందాల్సి ఉందని పాండా చెప్పారు. కాగా, వైరస్ ఇంకా వ్యాప్తి చెందుతోంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా నిబంధనలు, జాగ్రత్తలు కచ్చితంగా పాటించాల్సిందే అన్నారు.

కొత్త కరోనా వేరియంట్లపై కోవ్యాగ్జిన్ బాగా సమర్థవంతంగా పని చేస్తోందని పాండా చెప్పారు. కరోనా వైరస్ కొత్తది కావొచ్చు, పాతది కావొచ్చు. వైరస్ సంక్రమణ ఇంకా ఉంది. వైరస్ సోకిన వ్యక్తులు కారణంగా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయని వివరించారు.

కరోనా కొత్త వేరియంట్లపై కోవ్యాగ్జిన్ ఎలా పని చేస్తుందో ఐసీఎంఆర్ ఎపిడెమాలజిస్ట్ మాజీ చీఫ్ డాక్టర్ రమన్ గంగాకేడ్కర్ వివరించారు. కోవ్యాగ్జిన్ కొన్ని భాగాలను మాత్రమే కాక, వైరస్ మొత్తాన్ని టార్గెట్ చేస్తుందన్నారు. చాలా వ్యాక్సిన్లు ఇమ్యూన్ రెస్పాన్స్ ప్రొడ్యూస్ చేసేందుకు స్పైక్ ప్రొటీన్ విడుదల చేస్తాయి. వైరస్ లో చాలా భాగాలు ఉంటాయి. అందులో స్పైక్ ప్రొటిన్ ఒకటని చెప్పారు.