పెళ్లిళ్లలో 50మంది.. చావు కర్మలలో 20మంది మాత్రమే.. కేంద్రం ప్రకటన

  • Published By: vamsi ,Published On : May 5, 2020 / 02:58 PM IST
పెళ్లిళ్లలో 50మంది.. చావు కర్మలలో 20మంది మాత్రమే.. కేంద్రం ప్రకటన

కరోనా కారణంగా దేశవ్యాప్తంగా కళ్యాణాలు ఎన్నో ఆగిపోయాయి. అంతేనా? ముఖ్యమైన కార్యాలకు కూడా ఆటంకాలు ఏర్పడ్డాయి. అయితే తాజాగా పెళ్లిళ్లు, చావు కార్యాలకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది.

సామాజిక దూరాన్ని కొనసాగించడానికి వివాహ కార్యక్రమాలలో 50 మందికి.. మరణించిన వ్యక్తుల చివరి కర్మలలో 20 మంది ఉండటానికి అవకాశం కల్పించినట్లు హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) సంయుక్త కార్యదర్శి పుణ్య సలీలా శ్రీవాస్తవ వెల్లడించారు.

ప్ర‌స్తుతం ప‌నులు కొన‌సాగిస్తున్న‌ట్లు ఆఫీసుల్లో సోష‌ల్ డిస్టాన్సింగ్ త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని కోరారు.  ఫేస్ మాస్క్‌లు, శానిటైజ‌ర్లు ఆయా ఆఫీసులు కచ్చితంగా ఏర్పాటు చేయాల‌ని అన్నారు. ఉద్యోగులంతా ఆరోగ్య సేతు యాప్‌లో కచ్చితంగా రిజిస్ట‌ర్ చేసుకోవాల‌ని శ్రీవాస్త‌వా స్పష్టం చేశారు.

దేశంలో కోవిడ్‌19 పాజిటివ్ కేసుల సంఖ్య 46,433గా ఉన్న‌దని, గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 3900 కేసులు న‌మోదయ్యాయని, 195 మంది చనిపోయారని, 1020 మంది కోలుకున్నారని చెప్పారు. దేశంలో రిక‌వ‌రీ రేటు 27.41గా ఉందని చెప్పారు.