Covid Vaccination : అండమాన్-నికోబార్ దీవుల్లో 100శాతం వ్యాక్సినేషన్
దేశంలో రోజు రోజుకు కరోనా కేసులతో పాటు కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఈ క్రమంలో

Andaman2
Covid Vaccination : దేశంలో రోజు రోజుకు కరోనా కేసులతో పాటు కొత్త వేరియంట్ “ఒమిక్రాన్” కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇదే క్రమంలో దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగా సాగుతోంది. ఈ క్రమంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించి అండమాన్-నికోబార్ దీవులు కొత్త రికార్డును నెలకొల్పాయి.
రెండు డోసుల వ్యాక్సిన్ 100శాతం పూర్తి చేసిన మెుట్టమెుదటి కేంద్రపాలిత ప్రాంతంగా అండమాన్-నికోబార్ దీవులు రికార్డు సృష్టించింది. జనవరి 16 న ప్రారంభమైన టీకాల అందజేత శరవేగంగా పూర్తి చేయడంలో వైద్య సిబ్బంది కృషి చేశారు. వ్యాక్సినేషన్ మొత్తం కోవిషీల్డ్ వ్యాక్సిన్‌తోనే పూర్తిచేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఉత్తరం నుంచి దక్షిణం వరకు 800 కి.మీ విస్తీర్ణంలో ఉన్న 836 దీవులకు చేరుకొని వ్యాక్సిన్లు అందజేశామని తెలిపారు.
అండమాన్ నికోబార్ దీవుల్లో ఎక్కువగా అడవులు, కొండ ప్రాంతం మాత్రమే ఉంటుంది. అండమాన్ నికోబార్ దీవుల్లో వ్యాక్సినేషన్ అత్యంత సవాల్‌తో కూడుకున్న వ్యవహారమని..ప్రతికూల వాతావరణాన్ని సైతం తట్టుకుని టీకాలు వేశామని అక్కడి పాలకవర్గం ట్విట్టర్ లో తెలిపింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం అండమాన్ నికోబార్ దీవుల్లో మొత్తం 2.87 లక్షల మంది అర్హులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. దీంతో ఆ దీవుల్లో మొత్తం జనాభాలో 74.67 శాతం మందికి కరోనా టీకాలు అందాయి. ప్రస్తుతం అక్కడ రెండు యాక్టివ్ కరోనా కేసులు మాత్రమే ఉన్నాయని సమాచారం. ఇక, ఇప్పటికే అర్హులందరికీ 100 శాతం రెండు డోసుల వ్యాక్సిన్ ఇచ్చిన తొలి రాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
ALSO READ YS Sharmila : ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించిన వైఎస్ షర్మిల