Covid -19 Cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..

మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు దేశంలో 220.66 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్‌ డోస్‌లను అందించారు.

Covid -19 Cases: దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే..

Covid -19 cases

Covid -19 Cases: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత పది రోజుల నుంచి రోజువారి కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోయింది. దీంతో 10వేలు దాటాయి. కాగా, మంగళవారం మాత్రం కొత్త కేసుల నమోదు సంఖ్య భారీగా తగ్గింది. 6,660 మాత్రమే నమోదయ్యాయి. బుధవారం మళ్లీ కొవిడ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 9,629 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ తో చికిత్స పొందుతూ 29మంది మరణించారు. మంగళవారంతో పోలిస్తే.. 44శాతం కొవిడ్ కేసులు పెరిగాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 61,013 కు చేరింది.

Covid-19 In Supreme Court : నలుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కరోనా

తాజాగా 9, 629 కొత్త కేసుల నమోదుతో కలిపి దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4.48 కోట్ల కేసులు నమోదు. ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 5.31లక్షలకు చేరింది. రోజువారి పాజిటివిటీ రేటు 5.38 శాతం, వారపు సానుకూలత రేటు 5.61శాతంగా నమోదైంది. క్రియాశీలక కేసుల సంఖ్య 61, 031కి చేరుకోగా, రికవరీ రేటు 98.68శాతంగా నమోదైంది. ఒమిక్రాన్ వేరియంట్ XBB.1.16 వల్ల దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.

COVID-19 cases: 12వేలు దాటిన కొవిడ్-19 కేసులు.. 70వేలకు చేరువలో యాక్టివ్ కేసుల సంఖ్య

మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ ప్రకారం.. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటి వరకు దేశంలో 220.66 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్‌ డోస్‌లను  అందించారు. దేశ రాజధాని ఢిల్లీలో కొవిడ్ ఉధృతికొనసాగుతూనే ఉంది. మంగళవారం ఒక్కరోజే 1,095 పాజిటివ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. ఆరుగురు కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు.